ఫ్లోరిడా నేవల్‌ బేస్‌లో కాల్పులు: 12 మంది సౌదీ సైనికాధికారుల బహిష్కరణకు యూఎస్ సిద్ధం

గతేడాది డిసెంబర్‌లో ఫ్లోరిడా పెన్సాకోలాలోని నౌకా స్థావరంలో సౌదీ సైనికాధికారి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.ఎనభై మందికి గాయాలైన సంగతి తెలిసిందే.

 America Saudi Military Students China-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించి అమెరికా ప్రభుత్వం 12 మంది సౌదీ మిలటరీ విద్యార్ధులను బహిష్కరించాలని భావిస్తోంది.వీరిపై ఉగ్రవాదులతో సంబంధాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి అభియోగాలు కూడా ఉన్నాయి.

ఎఫ్‌బీఐ నిర్వహించిన దర్యాప్తులో దుండగుడు మహ్మద్ అల్షామ్రానీ దాడికి ముందు, దాడికి తర్వాత అతని ప్రవర్తనను చాలామంది చెప్పలేదని ది వాషింగ్టన్ పోస్ట్ కథనాలు ప్రచురించింది.డిసెంబర్ ఆరంభంలో పెంటగాన్ అధికారులు… యూఎస్‌లో శిక్షణ పొందుతున్న సౌదీ సైనిక సిబ్బందిపై తనఖీలు నిర్వహించార.

అయితే అప్పుడు ముప్పును అధికారులు అంచనా వేయలేకపోయారు.

Telugu Saudi Military, Telugu Nri Ups-

ఫ్లోరిడాలోని నేవి స్థావరంపై దాడి జరిగిన తర్వాత… సౌదీ సైనిక విద్యార్ధులకు శిక్షణను నిలిపివేశారు.అయితే క్లాస్‌రూమ్‌లో మాత్రం సూచనలు కొనసాగుతూనే ఉన్నాయి.సౌదీ రాయల్ వైమానిక దళంలో లెఫ్టినెంట్ అయిన 21 ఏళ్ల నిందితుడు లైసెన్స్‌డ్ గ్లోక్ 9 ఎంఎం హ్యాండ్‌గన్‌‌తో కాల్పులకు తెగబడ్డాడు.

దాడికి ముందు ట్విట్టర్‌లో అమెరికాను ఉద్దేశిస్తూ అసభ్యకరంగా ట్వీట్ చేశాడు.

Telugu Saudi Military, Telugu Nri Ups-

వాషింగ్టన్ పోస్ట్ కథనాల ప్రకారం… అల్షామ్రానీకి చెందిన రెండు ఐఫోన్‌లను యాక్సెస్ చేయడానికి సాయం చేయాల్సిందిగా ఎఫ్‌బీఐ… ఆపిల్‌ను కోరింది.అయితే ఎన్‌క్రిప్షన్‌ను మార్చాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కంపెనీ తోసిపుచ్చింది.తాము గతంలో క్లౌడ్ స్టోరేజ్‌లో సంబంధిత డేటాను పంచుకునేందుకు ఎఫ్‌బీఐకి సాయం చేసినట్లు ఆపిల్ తెలిపింది.

కాగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సుమారు 5 వేల మంది అంతర్జాతీయ సైనిక శిక్షణ పొందుతున్నారు.దీనిలో అన్ని శాఖలలో కలిపి సుమారు 850 మంది సౌదీకి చెందినవారు ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube