నేచురల్ స్టార్ నాని నటించిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘జెర్సీ’ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో నాని నటనకు అందరూ ఫిదా అయ్యారు.
ఈ సినిమాతో నాని తన ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమాను నమోదు చేసుకున్నాడు.అయితే తెలుగు సినిమాలను ఎక్కువగా రీమేక్ చేసే బాలీవుడ్ జనం ఈ సినిమాను కూడా రీమేక్ చేస్తున్నారు.
అర్జున్ రెడ్డి సినిమాను తెలుగులో రీమేక్ చేసిన షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ సినిమాను కూడా బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు.అయితే బాలవుడ్ వివాదాస్పద హీరోయిన్గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్, మరోసారి ఈ సినిమాపై తనదైన శైలిలో స్పందించింది.
ఆమె నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పంగా’ చిత్ర విషయాలను మీడియాతో పంచుకున్న ఆమె, షాహిద్ నటిస్తున్న జెర్సీ సినిమా గురించి తనకు అస్సలు తెలియదని అంది.జెర్సీ అనే ఓ సినిమా ఉందన, సౌత్‌లో అది సూపర్ సక్సెస్ అయ్యిందనే విషయం తనకు తెలీదని అంది.
ఈ బ్యూటీ చేసిన కామెంట్‌తో నాని ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు.తెలుగులో సూపర్ సక్సెస్ అయిన సినిమా గురించి ఆమెకు తెలియకపోవడం ఏమిటని, ప్రస్తుతం బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న విషయం కూడా తనకు తెలియదనడం మూర్ఖత్వం అని పలువురు అన్నారు.కాగా ‘పంగా’ సినిమాలో నటిస్తున్న కంగనా ఓ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తోంది.జనవరి 24న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు కంగనా చెప్పుకొచ్చింది.