వీడియో గేమ్‌లలో అశ్లీలత.. ఛాటింగ్‌తో పిల్లలకు ఎర: ఇకపై కనిపెట్టేస్తామంటున్న మైక్రోసాఫ్ట్

ఇది స్మార్ట్ యుగం.పిల్లలు, పెద్దలు అన్ని వయసుల వారు స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు లేకుండా సెకను కూడా ఉండలేరు.

 Microsoft Project Artemis New Tool Keep Kids Safe Predators In Video Game Chats-TeluguStop.com

ఆటలు, పాటలు, చదువులు, సరదాలు, సంతోషాలు, స్నేహాలు అన్ని ఆన్‌లైన్‌లోనే అయితే పిల్లల విషయంలో ఇవి మోతాదుకు మించడంతో దుష్భ్రభావాన్ని చూపిస్తోంది.అత్యధిక శాతం మంది చిన్నారులు ఆన్‌లైన్ గేమ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు.

సరదాగా ప్రారంభమైన ఈ అలవాటు వ్యసనంగా మారడంతో పిల్లలు వీడియో గేమ్‌లకు బానిసలుగా మారిపోతున్నారు.

Telugu Microsoft, Smart Tablets, Games-

వీడియోగేమ్స్‌లోని అశ్లీల కంటెంట్ పిల్లలు చిన్న వయసులోనే లైంగిక దాడికి గురయ్యేలా చేయడమో.లేదంటే ఇతరులపై దాడి చేయడమో చేస్తున్నారు.చిన్నారులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ మాయగాళ్లు కాటేయడానికి రెడీగా ఉంటారు.

ఇలాంటి పరిస్ధితుల్లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగింది.మల్టీప్లేయర్ వీడియో గేమ్‌లలో ఛాట్ ఫంక్షన్‌ను ఉపయోగించి పిల్లలకు వల వేసే వారిని గుర్తించేందుకు సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ తెలిపింది.

ఈ టెక్నాలజీని లాభాపేక్ష లేని సంస్థలు, ఇతర గేమింగ్, మెసేజింగ్ సర్వీస్ డెవలపర్లతో పంచుకుంటామని కంపెనీ ప్రకటించింది.

Telugu Microsoft, Smart Tablets, Games-

‘‘ప్రాజెక్ట్ ఆర్టెమిస్’’ అనే పేరున్న ఈ ఫీచర్.ఆటోమేటిక్‌గా టెక్స్ట్ ఆధారిత సంభాషణలను స్కాన్ చేసి.చిన్నారులను లైంగికంగా టార్గెట్ చేస్తున్న వారిని గుర్తిస్తుంది.

దీని సాయంతో హ్యూమన్ మోడరేటర్లు ఫ్లాగ్ చేసిన సంభాషణల ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చా లేదా అని సమీక్షించవచ్చు.డార్ట్‌మౌత్ కాలేజీ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు హనీ ఫరీద్ నేతృత్వంలోని ఇంజనీరింగ్ బృందం ఈ పద్ధతిని అభివృద్ధి చేసింది.

ఈ క్రమంలో కిక్ వంటి మెసేజింగ్ సేవల తయారీ సంస్థతో పాటు పాపులర్ గేమింగ్ కంపెనీ రాబ్లాక్స్‌తో ఫరీద్ కలిసి పనిచేశారు.జనవరి 10 నుంచి ఇది యాంటీ ట్రాఫికింగ్ గ్రూప్ థోర్న్ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube