రౌడీ బ్రాండ్ కి అల్లు అర్జున్ ఫిదా! విజయ్ మార్కెట్ స్ట్రాటజీ

టాలీవుడ్ లో అతి కొద్ది కాలంలోనే క్రేజీ హీరోగా తనదైన ముద్ర వేసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం యూత్ ఫాషన్ ఐకాన్ గా ఉన్నాడని చెప్పాలి.అతని స్టైల్, లుక్స్ కి బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఫాన్స్ అయిపోయారు.

 Vijay Devarakonda Give Rowdy Brand Cloths To Bunny-TeluguStop.com

ఇక అతను ఎంచుకునే సినిమాలు కూడా రెగ్యులర్ గా కాకుండా ఏదో కొత్తదనం ఉండే విధంగా చూసుకుంటూ తన స్టైల్ కి సరిపోయే కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ఫాషన్ వ్యాపారంలోకి అడుగు పెట్టి రౌడీ అనే బ్రాండ్ తో బట్టల వ్యాపారం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఇక అతని సినిమాలు, బయట ఈవెంట్స్ లో కూడా అవ్వే బట్టలు ఎక్కువగా వేసుకొని వాటికి బ్రాండ్ వేల్యూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తాజాగా అల్లు అర్జున్ కి అదిరిపోయే బహుమతి పంపించాడు.

వాటిని చూసి బన్నీ ఫిదా అయిపోయాడు.ఆ బహుమతికి స్పందనగా బన్నీ ట్విట్టర్ వేదికగా తన సంతోషం వ్యక్తం చేశారు.

రౌడీ బ్రాండ్ కి సంబంధించి బట్టలు బన్నీకి బహుమతిగా విజయ్ దేవరకొండ పంపించి అల్లు అర్జున్ ని మెప్పించాడు.ఆ బహుమతి అందుకున్న బన్నీ స్పందిస్తూ చెప్పిన విధంగా కొత్త బట్టలు పంపినందుకు ధన్యవాదాలు మై డియర్ బ్రదర్, రేపు అల వైకుంఠపురంలో విజయోత్సవ వేడుకలో నేను ఈ బట్టలే వేసుకుంటాను అని ట్వీట్ చేశారు.

అయితే బన్నీ రౌడీ బ్రాండ్ బట్టలు వేసుకుంటే మెగా ఫాన్స్, బన్నీ ఫాన్స్ కి కూడా రౌడీ బ్రాండ్ బట్టలు కొనుక్కునే అవకాశం ఉంది.ఈ మార్కెట్ స్ట్రాటజీ ఉపయోగించి విజయ్ దేవరకొండ ఇలా బన్నీకి గిఫ్ట్ గా బట్టలు పంపించాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube