ఆర్జీవీ ఒక సైకో బయోపిక్‌ టైటిల్‌కు నో అబ్జన్‌ కావాలట

రామ్‌ గోపాల్‌ వర్మ ఎన్నో వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించాడు.ఎన్నో సినిమాలతో సెన్షేషన్‌ క్రియేట్‌ చేశాడు.

 Rgv Biopic Title But He Wants Option-TeluguStop.com

ఎన్ని వివాదాలు వచ్చినా.ఎన్ని గొడవలు అయినా కూడా తాను అనుకున్న టైటిల్‌నే ముందుకు తీసుకు వెళ్తాడు, తాను అనుకున్నట్లుగానే సినిమాను తీస్తాడు.

అలాంటి వర్మపై జొన్నవిత్తుల ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు.ఆమద్య వర్మ మరియు జొన్నవిత్తుల మద్య సీరియస్‌ మాటల యుద్దం జరిగింది.

ఆ కోపంతో వర్మను చీల్చి చెండాడేందుకు జొన్నవిత్తుల సినిమా మొదలు పెడుతున్నాడు.

రామ్‌ గోపాల్‌ వర్మ కథతో జొన్నవిత్తుల దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రానికి ‘ఆర్జీవీ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.

దానికి ట్యాగ్‌ లైన్‌గా ఒక సైకో బయోపిక్‌ అంటూ పెట్టారు.అయితే ఈ టైటిల్‌కు ఛాంబర్‌ వారు ఒప్పుకోవడం లేదు.వర్మ నుండి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకు వస్తేనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేస్తామంటున్నారు.ఆయన కేసు వేస్తే మొత్తం అంతా కూడా కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని ఛాంబర్‌ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

Telugu Rgv Biopic, Sankranthi, Tollywood Box-Latest News - Telugu

రామ్‌ గోపాల్‌ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఇంకా చాలా వైల్డ్‌ టైటిల్స్‌ను రిజిస్ట్రర్‌ చేయించినప్పుడు ఎవరు ఏం అబ్జక్షన్‌ పెట్టలేదు.కాని మేము ఒక సింపుల్‌ టైటిల్‌ను తీసుకు వచ్చినా కూడా ఎందుకు అబ్జక్షన్‌ పెడుతున్నారు అంటూ చిత్ర నిర్మాత మరియు దర్శకుడు జొన్నవిత్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.ఈ విషయమై ప్రస్తుతం ఆర్జీవీ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆందోళనకు సిద్దం అవుతున్నారు.ఈ గొడవలు ఎక్కడకు దారి తీస్తాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube