9 మిలియన్ల ప్రైజ్ మనీ: ట్విట్టర్ ఫాలోవర్లకు బిలియనీర్ బంపరాఫర్, రీట్వీట్ చేస్తే చాలు

జపాన్ ఫ్యాషన్ దిగ్గజం యుసాకు మేజావా తన ట్విట్టర్ ఫాలోవర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.తన ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్న 1000 మందికి 9 మిలియన్లు ఇస్తానని ప్రకటించారు.

 Japanese Billionaire Is Giving Away 9 Million Twitter Followers-TeluguStop.com

ఇందుకోసం వారు చేయాల్సిందల్లా అతనికి రీట్వీట్ చేయడమే.ఇది వారి ఆనందాన్ని మరింత పెంచుతుందో లేదో చూడటానికి తాను చేస్తున్న ప్రయోగంగా మేజావా తెలిపారు.

యూట్యుబ్‌లో చేసిన ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.ఒక వ్యక్తి జీవితంలో ఆకస్మాత్తుగా మిలియన్ యెన్ రావడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడటానికి ఈ సీరియస్ సోషల్ ట్రయల్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ వీడియోలో మేజావా పోటీ వివరాలను వెల్లడించారు.దీనిని పోటీదారులు తమకు నచ్చిన విధంగా ఉపయోగించుకోవాలని, అలాగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా తెలిపారు.ఇందుకోసం వారు చేయాల్సిందిల్లా ట్విట్టర్‌లో తనను ఫాలో అవుతూ, జనవరి 7 అర్థరాత్రి ఈ పోటికి వివరాలకు సంబంధించిన ట్వీట్‌ను రీట్వీట్ చేయాలి.ఇప్పటికే 4 మిలియన్ల మంది మేవాజా పిలుపుకు స్పందించి రీట్వీట్ చేశారు.

లాటీరీ ద్వారా విజేతలను ఎంపిక చేసిన అనంతరం రెండు మూడు రోజుల్లో మేవాజా స్వయంగా వారికి తెలియజేస్తారు.విజయం సాధించిన వారు పొందిన ఆనందాన్ని తాను స్వయంగా తెలుసుకుంటానని, అలాగే ఈ ప్రయోగాన్ని విశ్లేషించేందుకు సామాజిక శాస్త్రవేత్లను పిలుస్తానన్నారు.

Telugu Telugu Nri Ups, Followers-

మేవాజాకు ఇలాంటివి కొత్త కాదు.2019 జనవరిలోనూ ఆయన ఇదే రకమైన ప్రయోగం చేశారు.100 మిలియన్ యెన్లు, (సుమారు 9,14,000 ) 100 మంది ట్విట్టర్ ఫాలోవర్లకు పంచుతానని తెలిపాడు.ఈ క్రమంలో మేవాజా ఒక రికార్డును బద్ధలు కొట్టాడు.గతేడాది జనవరిలో ఆయన చేసిన ట్వీట్‌ను 4.68 మిలియన్ల మంది రీ ట్వీట్‌ చేశారు.కాగా ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.మేజా ఆస్తుల విలువ 2 బిలియన్ డాలర్లు ఆయనకు రాక్ మ్యూజిక్, పెయింటింగ్ అంటే ఇష్టం.ఇదే సమయంలో 2017లో జీన్ మిచెల్ బాస్క్యియేట్ వేసిన పెయింటింగ్‌పై 1,111 మిలియన్ డాలర్లు వెచ్చించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube