దర్బార్ ఫస్ట్ డే కలెక్షన్లు.. రజినీయా మజాకా!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ దర్బార్ భారీ అంచనాల నడుమ నిన్న(జనవరి 9న) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో తలైవా బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటాడు.

 Darbar 1st Day Collections-TeluguStop.com

ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రజినీ యాక్షన్ తలైవా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చే విధంగా ఉండటంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా మంచి కలెక్షన్లు సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో దర్బార్ సినిమాకు మంచి స్పందన లభించడంతో ఈ సినిమాకు తొలిరోజు రూ.4.41 కోట్లు కలెక్ట్ చేసింది.డబ్బింగ్ సినిమా అయినా సూపర్ స్టార్ మేనియాకు ఇది నిదర్శనం అని అంటున్నారు సినీ జనం.అయితే రజినీ స్థాయికి ఇది కాస్త తక్కువే అని చెప్పాలి.ఇకపోతే ఈ కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం ఉందని, బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు వస్తుండటమే దీనికి కారణమని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఏదేమైనా దర్బార్ చిత్రం కొంతమంది తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా రజినీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.ఇక ఏరియాలవారీగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 2.03 కోట్లు

సీడెడ్ – 0.66 కోట్లు

నెల్లూరు – 0.18 కోట్లు

కృష్ణా – 0.24 కోట్లు

గుంటూరు – 0.40 కోట్లు

వైజాగ్ – 0.44 కోట్లు

ఈస్ట్ – 0.28 కోట్లు

వెస్ట్ – 0.18 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 4.41 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube