అమరావతి రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం

రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన వారు, చుట్టు పక్కల గ్రామాల వారు రాజధాని మార్పు నేపథ్యంలో తీవ్ర ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే.గత మూడు వారాలుగా అమరావతి దర్నాలు మరియు రాస్తా రోకోలతో దద్దరిల్లుతోంది.

 Amaravathi Jagan Farmars Botsa Satyanarayana-TeluguStop.com

రైతులు ఆత్మహత్యలకు కూడా సిద్దం అవుతున్నారు.ఇలాంటి సమయంలో ప్రభుత్వం వారికి భరోసా కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అమరావతిని హైదరాబాద్‌ మించి అభివృద్ది చేసే బాధ్యత తమది అని ఖచ్చితంగా రైతులందరికి మరియు చుట్టు పక్కల గ్రామాల వారికి ఉపయోగదాయకంగా అభివృద్ది చేస్తామంటున్నారు.

రాజధాని ప్రాంతంలో రైతులు ఏమాత్రం ఆందోళన చెందనక్కర్లేదు అని, మీరు ఇచ్చిన భూములకు మీకు రెట్టింపు ప్రతిఫలం అందుకునేలా చేస్తామంటూ మంత్రి బొత్స తాజాగా ఒక ప్రకటన చేశాడు.

సీఎం జగన్‌ మీపై ప్రత్యేక శ్రధ్దను కనబర్చాలంటూ ఆదేశించాడు.తప్పకుండా మీ యొక్క సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి.ప్రతిపక్షాలు ఈ విషయాలను రాద్దాంతం చేయడం మానేస్తే బాగుంటుంది అంటూ ఈ సందర్బంగా మంత్రి బొత్స అన్నాడు.రైతులు అందరు కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలంటూ సూచించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube