ఆర్ఆర్ఆర్ తరువాత ఆయనతోనే అంటోన్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో తన యాక్టింగ్‌తో మూవీ క్రిటిక్స్ చెంప చెళ్లుమనిపించాడు.చిరు తనయుడు యాక్టింగ్ సరిగా చేయలేకపోతున్నాడే అనే వారికి ఆ సినిమాతో సమాధానం ఇచ్చాడు చరణ్.

 Ram Charan Next Movie With Anil Ravipudi-TeluguStop.com

ఇక ఇప్పుడు తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో చరణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే తనవంతు షూటింగ్ పార్ట్‌ను ముగించుకున్న చరణ్ ప్రస్తుతం తన తండ్రి చిరంజీవి 152వ చిత్ర నిర్మాణ పనులు చూసుకుంటున్నారు.

కాగా చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతం క్రేజ్‌ ఉన్న దర్శకుడిగా పేరుతెచ్చుకున్న అనిల్ రావపూడితో చేయనున్నట్లు తెలుస్తోంది.ఎఫ్2 సినిమాతో గత సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన అనిల్ రావిపూడి, ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అనే సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ సినిమాను తెరకెక్కించిన అనిల్ రావిపూడి ఇండస్ట్రీ హిట్‌పై కన్నేశాడు.ఈ సినిమా గనక సూపర్ సక్సెస్ అయితే చరణ్ అనిల్ రావిపూడితో సినిమా చేయాలని చూస్తున్నాడు.

మరి చరణ్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా వస్తే ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు మెగా ఫ్యాన్స్.ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా ఎలాంటి హిట్ సాధిస్తుందో చూడాలి అంటున్నారు సినీ ప్రేక్షకులు.

ఈ సినిమా రికార్డులను సృష్టించడం ఖాయమని అంటున్నారు పలువురు సినీ జనం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube