లంచం అడిగిన ఎమ్మార్వో... గేదెని ఇచ్చిన మహిళ

ప్రభుత్వం రంగ వ్యవస్థలో లంచం ఎ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లంచం తీసుకున్న వారు ఏసీబీకి పట్టుబడుతున్న కూడా వారిలో ఎలాంటి భయం ఉండటం లేదు.

 Madhya Pradesh Woman Offers Buffalo As Bribe-TeluguStop.com

ఇలా లంచం తీసుకొని దొరికిన ప్రభుత్వ ఉద్యోగుల మీద కఠిన చర్యలు తీసుకునే చట్టాలు లేకపోవడం వలన వారి ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు.ఎమ్మార్వో కార్యాలయంలో ప్యూన్ నుంచి ప్రతి ఒక్కరు లంచం డిమాండ్ చేస్తూ ఉంటారు.

అవతలి వారు ఎంత పేదవాడైన కూడా వారికి సంబంధం లేదు.అడిగినంత ఇస్తేనే పని జరిగేది.

ఇలాంటి వ్యవస్థల కారణంగా ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇదిలా ఉంటే లంచం అడిగిన తహసీల్దార్‌కు ఓ మహిళ ఊహించని విధంగా తన ఇంటిలో ఉన్న గేదెను తీసుకొచ్చి ఇచ్చింది.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.నౌధియా గ్రామానికి చెందిన రాంకలీ పటేల్ అనే మహిళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని తన పేరు మీద మార్చుకోవడానికి తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంది.

అయితే ఆ పని చేయాలంటే 10వేలు లంచం ఇవ్వాలని తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు డిమాండ్ చేశారు.దీంతో ఆ మహిళ అప్పు చేసి 10వేలు లంచం ఇచ్చింది.

అయిన అధికారులు పని చేయకుండా మరో 10వేలు లంచంగా ఇవ్వాలన్నారు.లంచంకి డబ్బులు లేకపోవడంతో ఆమె లంచంగా తన గేదెను తీసుకొని వచ్చింది.

దీంతో ఈ ఘటన చుట్టుపకల మీడియాకి, ప్రజలకి తెలియడంతో అలెర్ట్ అయిపోయి మాట మార్చేశారు.అయితే ఈ సంఘటన స్థానికంగా మాత్రం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube