జీరో సైజు కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న గోవా బ్యూటీ

దేవదాసు సినిమాతో రామ్ పోతినేని సరసన నటించి తన అందాలతో కుర్రాళ్ల గుండెల్లో బీట్ పెంచేసిన గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలియని వారుండరు.ఒకప్పుడు దాదాపుగా అందరి అగ్రహీరోల సరసన నటించి తన కెరియర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఈ అమ్మడు మనసు బాలీవుడ్ వైపు మళ్లింది.

 Latest News About Goa Beauty Ileana-TeluguStop.com

దీంతో అనుకున్నదే తడవుగా తన మకాం  బాలీవుడ్ కి మార్చింది ఈ అమ్మడు.అయితే మొదట్లో బాలీవుడ్ కి వెళ్ళిన కొత్తలో మంచి ఆఫర్లే వచ్చినప్పటికీ సరైన హిట్ లేక తన ఉనికిని చాటుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంది.

దాంతో చివరికి టాలీవుడ్ గూటికి చేరింది.ఈ క్రమంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన టువంటి అమర్ అక్బర్ అంథోని చిత్రంతో మళ్లీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు పెద్దగా తలుపు తట్టలేదు.దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఖాళీగా ఉంటుంది ఈ అమ్మడు.

Telugu Ileana Dcruz, Ileanadcruz, Ileana Latest, Ileana, Ileanatelugu-Movie

అయితే ఒకప్పుడు జీరో సైజ్ నడుము అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది గోవా బ్యూటీ ఇలియానా మాత్రమే అలాంటిది ఇప్పుడు ఈ ఇలియానాని చూస్తే గుండె తరుక్కుపోతోంది.తాజాగా ఈ అమ్మడు తన అందాన్ని మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తారు ఉందట. అందుకుగానూ రోజువారి జిమ్ముకి వెళ్తూ మంచి ఆహార డైట్ ను ఫాలో అవుతుందట.ఏదేమైనప్పటికీ ఇలియానా మాత్రం మళ్ళీ తన అందానికి పూర్వవైభవం తెచ్చుకుంటే మాత్రం ఇప్పటి తరం హీరోయిన్లకు పోటీ తప్పదని చెప్పవచ్చు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube