క్యురేటివ్ పిటీషన్ దాఖలు చేసిన నిర్భయ నిందితుడు

2012 లో ఢిల్లీ లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.అయితే ఈ ఘటనలో నిందితులు అయిన నలుగురికి ఇటీవల ఢిల్లీ పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడం తో తీహార్ జైలు అధికారులు మాక్ ఉరి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు.

 Nirbhaya Victim Vinay Files A Curative Petition-TeluguStop.com

అయితే ఈ సమయంలో వినయ్ శర్మ సుప్రీం కోర్టు లో క్యురేటివ్ పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.వినయ్ శర్మ తరఫున క్యూరేటివ్ పిటిషన్ దాఖలుచేసిన లాయర్ ఏపీ సింగ్.

డేత్ వారెంట్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.అంతేకాదు, ఘటన జరిగే నాటికి వినయ్ శర్మ వయసు కేవలం 19 ఏళ్లేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.

చిన్న వయసు, సామాజిక ఆర్ధిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని దోషికి వెసులుబాటు కల్పించాలంటూ క్యురేటివ్ పిటీషన్ లో పేర్కొన్నారు.గతంలో అత్యాచారం, హత్యలకు సంబంధించిన 17 కేసుల్లో సుప్రీంకోర్టు మార్చిన తీర్పులను పిటిషనర్ ప్రస్తావించాడు.

ఈ కేసుల్లో మైనర్లు సహా దోషులకు ఉరిశిక్షను యావజ్జీవిత ఖైదుగా మార్చిన విషయాన్నీ గుర్తుచేసిన పిటిషనర్, తనకు కూడా అదే విధంగా ఉపశమనం కలిగించాలని కోరాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube