మంచు ఫ్యామిలీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది మంచు లక్ష్మీ.తనదైన యాక్టింగ్‌తో పాటు తన మాటల స్లాంగ్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకునే మంచు లక్ష్మీ ప్రస్తుతం రాజకీయ నేతగా మారనుంది.
అయితే రియల్ లైఫ్ రాజకీయాల్లోకి మంచు లక్ష్మీ ఎంట్రీ ఇస్తుందని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే.
ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా జోరుగా నడుస్తోంది.
చిన్న స్టార్స్ నుండి స్టార్ యాక్టర్స్ వరకు అందరూ వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.దీంతో మంచు లక్ష్మీ కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు రెడీ అయ్యింది.
ఆమె నటించబోయే వెబ్‌సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేయనున్నాడు.ఓ ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీతో కలిసి మంచు లక్ష్మీ ఈ వెబ్‌సిరీస్‌ను స్వయంగా ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ వెబ్ సిరీస్‌లో మంచు లక్ష్మీ ఓ రాజకీయ నాయకురాలిగా నటించనుంది.పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్‌ను అతిత్వరలో మొదలుపెట్టేందుకు రెడీ అవుతోంది మంచు లక్ష్మీ.
గతంలో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెడుతుందని వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారానైనా రాజకీయ నాయకురాలిగా మంచు లక్ష్మీ కనిపించనుంది.
మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి.