అందరినీ మెప్పించిన ఎంత మంచివాడవురా!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ఎంత మంచివాడవురా ఇప్పటికే షూటింగ్ పనులు అన్నీ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమానును సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

 Entha Manchivaadavuraa Gets U Certificate From Censor-TeluguStop.com

కాగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు తాజాగా సెన్సార్ బోర్డు సభ్యులు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

మంచి ఫ్యామిలీ కథను ఎంచుకున్న దర్శకుడు సతీష్ వేగ్నేశను సెన్సార్ సభ్యులు అభినందించారు.కుటుంబంలోని బంధాలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్ర యూనిట్‌ను వారు మనస్ఫూర్తిగా మెచ్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇక కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఈ సినిమాలో చాలా బాగుందని, ఆయన గత చిత్రాలకంటే ఈ సినిమాలో ప్రేక్షకులను ఎక్కవగా మెప్పి్స్తారని వారు కితాబిచ్చారు.చిత్రంలో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చిత్ర యూనిట్ తెలిపింది.

ఏదేమైనా సెన్సార్ బోర్డు సభ్యులు తమ సినిమాకు పూర్తి పాజిటివ్ రిపోర్టుతో పాటు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇవ్వడం నిజంగా గర్వంగా ఉందని చిత్ర యూనిట్ పేర్కొంది.సంక్రాంతి బరిలో జనవరి 15న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ చేయనున్నారు.

మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube