బహుమతి రాదని లాటరీ టికెట్ల ను చెత్త బుట్టలో పడేశాడు, తీరా చూస్తే

లక్ష్మి దేవి ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడానికి వీలు పడదు.ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో అన్న విషయమే తెలియదు.

 Vendor Forages Lottery Tickets Out Of Bin To See-TeluguStop.com

అయితే ఒక కూరల వ్యాపారి విషయంలో కూడా లక్ష్మి దేవి తలుపుతట్టింది లాటరీ రూపంలో.ఎదో సరదాగా లాటరీ టికెట్ కొనుక్కుంటే అతడి దశ మారిపోయింది.

అతడి లాటరీ టికెట్ కు ఒక లక్ష రెండు లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయలు లాటరీ తగలడం తో వారి దశ తిరిగిపోయింది.పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా లో ఈ ఘటన చోటుచేసుకుంది.

కోల్ కతా లోని దమ్ దమ్ ప్రాంతంలో కూరగాయాల దుకాణం నిర్వహిస్తున్న సాదిక్ అనే వ్యక్తి నూతన సంవత్సరం సందర్భంగా నాగాలాండ్ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.అయితే అతడి స్నేహితులు మాత్రం నువ్వు బహుమతి గెలుచుకోలేవు అంటూ గేలి చేయడం తో కోపం వచ్చిన అతడు ఆ టికెట్లను తీసుకువెళ్లి ఒక చెత్త బుట్టలో పడేశాడు.

అయితే తరువాతి రోజు ఆ లాటరీ టికెట్ విక్రయించిన వ్యక్తి ఎదురుపడి నీవు కొన్న లాటరీ టికెట్ల లో ఒకదానికి కోటి రూపాయల బహుమతి తగిలింది అని తెలపడం తో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.వెంటనే ఈ విషయాన్నీ తన భార్య అమీనా కు చెప్పడం తో వారంతా కూడా తెగ సంతోష పడిపోయారు.

ఇక లాటరీ తగిలింది అన్న విషయం తెలుసుకున్న అమీనా చెత్త బుట్టలో పడేసిన టికెట్ల కోసం వెతకడం మొదలు పెట్టింది.అయితే అదృష్టం కొద్దీ ఆ టికెట్లు దొరకడం తో వారు కోటి రూపాయల బహుమతిని గెలుచుకున్నారు.

Telugu Lotterytickets, Telugui Nri Ups, Vendorforages-

అలానే మొత్తం 5 టికెట్లు కొనగా ఒకదానికి కోటి రూపాయల బహుమతి దొరకగా,మిగిలిన నాలుగిటికి లక్ష రూపాయల చొప్పున బహుమతి గెలుచుకున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి ఎదో నూతన సంవత్సరం అని లాటరీ టికెట్ కొనుక్కుంటే ఇంత భారీ మొత్తంలో లాటరీ తగలడం తో ఆ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది.ఈ డబ్బు తో తమ జీవితాలే మారిపోతాయి అంటూ వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube