పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే....

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి.ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీలో మాత్రం చాలా అనూహ్యమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

 Jc Diwakar Reddy Ysrcp Tdp-TeluguStop.com

తాజాగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి ముందస్తు బెయిల్ తో పోలీసులకు లొంగిపోయారు.

అయితే గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.

ఈ పర్యటనలో భాగంగా పాల్గొన్న జేసి దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అండ చూసుకొని పోలీసులు కావాలనే తెలుగుదేశం పార్టీ నేతలను మరియు నాయకులను టార్గెట్ చేసుకుని వారిపై అక్రమ కేసులు తున్నారని, మళ్లీ తమ ప్రభుత్వం వచ్చాక తమ బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటామంటూ పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Telugu Anantapur, Diwakar Reddy, Tdpjc, Telugu Desham, Telugudesham-Political

అయితే అప్పటి నుంచి జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు జేసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎటువంటి పోలీసు అధికారుల సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జేసి దివాకర్ రెడ్డి పై కేసు కూడా నమోదు చేశారు.దీంతో జేసీ దివాకర్ రెడ్డి ముందస్తు బెయిల్ తీసుకుని ఈరోజు పోలీసులకు లొంగిపోయారు.

అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సగం వరకు ఖాళీ అయిన దాఖలాలు కనిపిస్తున్నాయి అందుకు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే చెప్పవచ్చు.

ఇప్పటికే ముఖ్య నేత అయినటువంటి దేవినేని అవినాష్ వైకాపా పార్టీ కండువా కప్పుకున్నారు.అంతేగాక  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా చంద్రబాబు నాయుడుతో తీవ్రంగా విభేదించి తన ఎమ్మెల్యే పదవికి రాజినామా చేసిన సంగతి తెలిసిందే.

దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పటికే పలువురు నేతలు కూడా పార్టీ మారే యోచనలో పడినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube