థూ.. నీవేం ప్రధానివిరా బాబు

పాకిస్తాన్‌ ప్రధాని పదే పదే తప్పు మీద తప్పు చేస్తున్నాడు.సోషల్‌ మీడియాలో ఆయన చేస్తున్న పోస్ట్‌లు ఆయనకు పేరు తెచ్చి పెట్టక పోగా ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి.

 Social Media Trolls In Imran Khan-TeluguStop.com

గతంలో తప్పుడు ట్వీట్స్‌ చేయడం వల్ల విమర్శల పాలు అయిన పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి ఇండియా పరువును అంతర్జాతీయ స్థాయిలో తీయాలనే ఉద్దేశ్యంతో తన పరువునే పోగొట్టుకున్నాడు.ఇండియాపై అక్కస్సుతో తప్పుడు వీడియోలను పోస్ట్‌ చేయడంతో అవే అతడిపై విమర్శలు వచ్చేలా చేశాయి.

వివరాల్లోకి వెళ్తే.ఇండియాలో మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త పౌరసత్వ బిల్లుకు ముస్లీంలు చాలా వ్యతిరేకంగా ఉన్నారని, వారిని అణచివేసేందుకు భారత ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని, ముస్లీంలపై ఇలా దాడులు చేస్తున్నారంటూ ఒక వీడియోను పోస్ట్‌ చేయడం జరిగింది.

ఆ వీడియోలో పోలీసులు ముస్లీంలను చావబాదుతున్నది నిజమే.కాని అది ఇండియాకు చెందిన వీడియో కాదు.ఢాకాలో 2013లో ఒక ఆందోళన జరుగుతుంటే దాన్ని చెదరగొట్టేందుకు అక్కడి పోలీసులు చేసిన లాఠీ చార్జ్‌ అది.బంగ్లాదేశ్‌ వీడియోను తీసుకు వచ్చి ఇండియాలో జరిగిందని అంటావా అనగానే వెంటనే కొన్ని నిమిషాల వ్యవదిలోనే ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశాడు.ఇలా గతంలో కూడా ఇమ్రాన్‌ ఖాన్‌ చేశాడు.అందుకే థూ నీవు ఒక ప్రధానివా అంటూ సోషల్‌ మీడియాలో ఆయనపై విమర్శలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube