బోస్టన్ కమిటీ నివేదిక : ఫైనల్ రిపోర్ట్ ఇదే

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చుసిన బోస్టన్ కమిటీ నివేదిక ఎట్టకేలకు ప్రభుత్వానికి అందింది.దీనికి సంబందించిన పూర్తి వివరాలను ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ కుమార్ విడుదల చేశారు.ఈ నివేదికలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఏ విధంగా సాధించవచ్చు అనే విషయంపై పూర్తి స్థాయి నివేదికలో బోస్టన్ కమిటీ ప్రభుత్వానికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చింది.

 Bostan Committe Final Report-TeluguStop.com

సూచనల్లో ముఖ్యాంశాలు :

ఆరు అంశాల ఆధారంగా చేసుకుని బోస్టన్ కమిటీ నివేదికను తయారుచేసింది.రాజధాని కోసం రెండు ఆప్షన్లు ఇచ్చిన కమిటీ మొదటి ఆప్షన్ లో విశాఖపట్నంలో సెక్రటరియేట్, ప్రజలతో నేరుగా సంబంధం లేని శాఖల కార్యాలయాలు, అత్యవసర అసెంబ్లీ సమావేశాలను, హైకోర్టు పెట్టుకోవచ్చు.అమరావతిలో శాఖాధిపతుల కార్యాలయాలు, అసెంబ్లీ, హైకోర్టును కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు స్టేట్ కమిషన్ అప్పిలేట్ బాడీలను ఏర్పాటు చేయవచ్చు.

ఆప్షన్ టు లో విశాఖలో సెక్రటరియేట్, సీఎం గవర్నర్ ఆఫీసులు, అన్ని శాఖల కార్యాలయాలు, అత్యవసర సమావేశాలు కోసం అసెంబ్లీ, హైకోర్టు, అమరావతి లో హైకోర్ట్ బెంచ్, అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చని సూచించింది.విశాఖలో మాత్రమే పోర్టులు అభివృద్ధి చెందాయి.

విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు, పశ్చిమ గోదావరి, కడప, కర్నూల్ జిల్లాలో పారిశ్రామిక ఉత్పత్తి చాలా తక్కువ.ఏపీకి 2.2 లక్షల కోట్ల అప్పు ఉంది.తలసరి ఆదాయంలో కూడా ఏపీ వెనుకబడి ఉంది.

రాష్ట్రంలో 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి.అన్ని ప్రకృతి వనరులు ఉన్న వినియోగించుకోలేని పరిస్థితి ఉంది.

విశాఖ నుంచి చెన్నై వరకు రోడ్డు కనెక్టివిటీ ఉంది.వ్యవసాయ రంగంలో నాలుగు జిల్లాల్లో ఉత్పత్తి తక్కువ.

 ఇంటర్నేషనల్ లింక్ కేవలం విశాఖకు మాత్రమే ఉంది.దక్షిణాది రాష్ట్రాలో ఏపీలోనే తలసరి ఆదాయం తక్కువగా ఉంది.

వ్యవసాయంలో క్రిష్ణా, గోదావరి బేసిన్లో 50 శాతం ఉత్పత్తి ఉంది.కొత్తగా ఐదు ఎక్స్‌ప్రెస్ వేలను బీసీజీ ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత జాతీయ సగటు కంటే తక్కువ.

ఎకానమీలో ఏపీ ఎనిమిదో పెద్ద రాష్ట్రంగా ఉంది.మరిన్ని పోర్టులను అభివృద్ధి చేయాలి.

గోదావరి, క్రిష్ణా నదులను పెన్నా నదితో అనుసంధానం చేయాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube