ఇరాన్ నిఘా విభాగం అధినేత ను హతం చేసిన అమెరికా బలగాలు

ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్ అధినేత జనరల్ ఖాసీం సోలెమన్ ను అమెరికా బలగాలు హతమార్చినట్లు తెలుస్తుంది.ఇరాక్ లోని అమెరికా కార్యాలయం పై జరిగిన దాడి వెనుక ఖాసీం హస్తం ఉందని భావిస్తున్న అమెరికా ఈ మేరకు అతనిని అంతమొందించడానికి ఆదేశాలు జారీ చేసింది.

 Rocket Attack In Baghdhad Air Port-TeluguStop.com

దీనితో శుక్రవారం తెల్లవారు జామున వ్యూహం ప్రకారం బాగ్దాద్ ఎయిర్ పోర్టు పై రాకెట్ దాడి జరిపి ఆయన్ను అంతమొదించినట్లు తెలుస్తుంది.ఖాసీం సోలెమన్ లక్ష్యంగా అమెరికా జరిపిన మూడు రాకెట్ దాడుల్లో ఆయనతో పాటు ఏడుగురు మరణించారు.

వారిలో ఇరాక్ తిరుగుబాటు సంస్థ మొబిలైజేషన్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్ అబు మహమదీ అల్ ముహందిన్‌తో పాటు ఇరాక్, ఇరాన్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు ఉన్నారు.ఖాసిం, ముహందిన్ బాగ్దాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నారన్న పక్కా సమాచారంతో అమెరికా రాకెట్ దాడులు జరిపి అంతమొందించింది.

ఖాసిం ఈ తెల్లవారుజామున సిరియా నుంచి ప్రత్యేక విమానంలో బాగ్దాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.ఆయనకు స్వాగతం పలికేందుకు ముహందిన్ ప్రత్యేక కాన్వాయ్‌లో విమానాశ్రయానికి వచ్చారు.

Telugu Iraq America, Khadforce, Rocket, Rocketattack-

ఖాసిం, ముహందిన్ ఎయిర్‌పోర్టులోకి వచ్చిన కొన్ని క్షణాలకే రాకెట్ దాడి జరగడం తో వారు మరణించినట్లు తెలుస్తుంది.ఖాసిం చేతివేలుకున్న ఉంగరం ఆధారంగా ఆయన మృతదేహాన్ని గుర్తించారు.ఖాసిం విమానం దిగగానే రాకెట్ ఢీకొట్టిందని, మొత్తం మూడు రాకెట్లతో దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.మరోపక్క ఈ దాడి తో మధ్య ఆసియా ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయని, .దాడిపై ఇరాక్ తిరుగుబాటుదారులు, ఇరాన్ తోపాటు దాని మద్దతు దేశాలు తీవ్రంగా బదులిచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube