హార్దిక్ పాండ్యా నిశ్చితార్థంపై స్పందించిన క్రునాల్ పాండ్యా

టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలో పెట్టి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నాడు.కొత్త ఏడాదిలో తన ప్రియురాలు సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిక్ తో కొత్త సంవత్సర వేడుకలలో భాగంగా దుబాయ్ లో ఉంగరం తొడిగి నిశ్చితార్ధం చేసుకున్నాడు.

 Hardik Pandya Engaged Natasa Stankovic-TeluguStop.com

ఇక నిశ్చితార్ధం తర్వాత వారి ఫోటోలని షోషల్ మీడియాలో షేర్ చేశారు.ఊహించని విధంగా హార్దిక్ పాండ్యా ఇచ్చిన ఈ ట్రీట్ కి అందరూ షాక్ అయిన అతనికి టీం ఇండియా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉంటే తాజాగా హార్దిక్ పాండ్యా అన్నయ్య ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్యా కూడా తమ్ముడు విషెస్ చెప్పి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన కామెంట్స్ పెట్టాడు.మొదట హార్దిక్‌, నటాషాలకు నా బిగ్‌ కంగ్రాట్స్‌.

నటాషా మీకు మా కుటుంబంలోకి స్వాగతం.నటాషా నీవు మా క్రేజీ ఫ్యామిలీతో కలవడం మాకు సంతోషంగా ఉంది.

వెల్‌కమ్‌ టూ మ్యాడ్‌నెస్‌, లవ్‌ బోత్‌ ఆఫ్‌ యూ గాయ్స్‌ అని పోస్ట్ పెట్టాడు.ఇక ఈ పోస్ట్ పై హార్దిక్ పాండ్యా, అతని ఆఫ్ పార్టనర్ నటాషా స్పందించి థాంక్స్ చెప్పారు.

ఇక హార్దిక్ పాండ్యా నిశ్చితార్ధంతో అతనిపై ఇంతకాలంలో బాలీవుడ్ లో చక్కర్లు కొట్టిన గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పడిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube