కొనసాగుతున్న పుదుచ్చేరి సీఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ వార్

గత కొంత కాలంగా పుదుచ్చేరి సీఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ ల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం కావడం తో ఇద్దరూ కూడా అధికారం విషయంలో పోటీ పడుతున్నారు.

 Puducherry Cm Vs Lt Governor Kiran Bedi-TeluguStop.com

లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తన పరిధిని మించి రోజు వారి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు అంటూ పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో గతంలో రాజ్ నివాస్ ముందు బైఠాయించి ఆమెకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సందర్భాలు ఎన్నో వున్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా మరోసారి కిరణ్ బేడీకి వ్యతిరేకంగా ఈయన ప్రత్యక్ష పోరాటానికే దిగారు.సంక్షేమ పథకాలు అమలులో కిరణ్ బేడీ జోక్యాన్ని నారాయణ స్వామి తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని ఆయన ఈ సందర్భగా మండిపడుతున్నారు.మరోపక్క కిరణ్ బేడీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సీఎం ఆరోపణలపై కౌంటర్ ఇస్తూనే ఉన్నారు.

నారాయణ స్వామీ ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె పంధాలో ఆమె కొనసాగుతూనే ఉన్నారు.ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పధకాల విషయంలో జోక్యం చేసుకుంటూనే ఉన్నారు.

ప్రభుత్వంలో జోక్యంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను కేంద్ర హోంశాఖ మద్రాస్ హైకోర్టులో సవాల్ చేసిందని.తీర్పు వచ్చే వరకు ముఖ్యమంత్రి ఓపిక పట్టాలి అంటూ ఆమె కౌంటర్ ఇచ్చారు.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా నియమిస్తూ నారాయణస్వామిప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను గవర్నర్ తిప్పిపంపడం తో మరోసారి వీరి మధ్య వివాదం విషయం హాట్ టాపిక్ గా మారింది.ఎవరి అధికార పరిధి ఏంటి అన్నది మద్రాస్ హైకోర్టు తేల్చే వరకు పుదుచ్చేరి సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వివాదం సమసిపోయే సూచనలు అయితే మాత్రం ఏమాత్రం కనిపించడం లేదని చెప్పాలి.

గతంలో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ తరచూ పరిపాలన విషయంలో జోక్యం చేసుకుంటున్నారు అని ఆరోపణలు చేసినప్పటికీ కిరణ్ బేడీ మాత్రం తన పని తానూ చేసుకుంటూ పోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube