హమ్మయ్య : వాట్సప్‌ కొత్త ఫీచర్‌, ఇకపై ప్రేమికులకు ఆ తిప్పలు తప్పినట్లే

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ అనేది నిత్యవసర వస్తువు అయ్యింది.ఫోన్‌ లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదు.

 Whatsapp Is Going To Bring Dark Mode Option Very Soon For Nigh Users-TeluguStop.com

ఈదేశం ఆదేశం అని కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాబాకు దాదాపుగా సగానికి పైగా ఫోన్‌లు ఉన్నాయి అంటే అతిశయోక్తి లేదు.గతంలో ఫోన్‌లు లేని సమయంలో కమ్యూనికేషన్‌కు చాలా ఇబ్బంది అయ్యేది.

ఆ తర్వాత ఫీచర్‌ ఫోన్స్‌ వచ్చిన తర్వాత మెసేజ్‌లు చేస్తూ ఉండేవారు.ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చాయి.

స్మార్ట్‌ ఫోన్‌లతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ప్రతి స్మార్ట్‌ ఫోన్‌లో వాట్సప్‌ ఉంటుంది.

ఆ వాట్సప్‌ ప్రపంచాన్ని మన ముందు ఉంచుతుంది.

Telugu App Whats App, Whats App Time, Whatsapp, Whatsappdark-

వాట్సప్‌ వినియోగదారులు ఏ స్థాయిలో ఇండియాలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.భారీ ఎత్తున వాట్సప్‌ను వినియోగిస్తున్న వినియోగదారులు రాత్రి సమయంలో ఎక్కువగా చాటింగ్‌ చేస్తున్నట్లుగా ఒక అధ్యయనంలో వెళ్లడయ్యింది.రాత్రి సమయంలో లేదంటే ఉదయం 7 గంటల లోపులోనే ఎక్కువ మంది చాటింగ్‌ చేస్తున్నారు.

డే టైంలో చాటింగ్‌ చేసినా కూడా అది తక్కువగానే ఉంటుంది.రాత్రి సమయంలో ఎక్కువగా ప్రేమికులు చాటింగ్‌ చేసుకుంటున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడయ్యింది.

ఇన్ని రోజులు రాత్రి సమయంలో చాటింగ్‌ చేసుకునే వారు కంటికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు.ఇకపై వారికి ఆ సమస్య దూరం కాబోతుంది.

Telugu App Whats App, Whats App Time, Whatsapp, Whatsappdark-

రాత్రి సమయంలో వాట్సప్‌ చేసే వారి కంటిపై భారం పడుతూ ఉంది.రాత్రి సమయంలో ఎక్కువగా ఫోన్‌లో చూసే వారి కళ్లు చాలా ఎఫెక్ట్‌ అవుతున్నాయని, అదే చాలా కాలం కొనసాగితే వారి కళ్లకు పెద్ద ప్రమాదం తప్పదంటూ చాలా మంది డాక్టర్లు చెప్పారు.అందుకే వాట్సప్‌ అద్బుతమైన ఫీచర్‌ను తీసుకు వచ్చింది.అదేంటీ అంటే ఇకపై రాత్రి సమయంలో నైట్‌ మోడ్‌తో చాటింగ్‌ చేసుకోవచ్చు.నైట్‌ మోడ్‌ వల్ల కళ్లకు బ్రైట్‌ నెస్‌ ఎక్కువగా ఉండదు.కంటిపై చాలా తక్కువ పరిమాణంలో ప్రభావం ఉంటుంది.

కంటికి అసలు ఇబ్బంది ఉండదు.

Telugu App Whats App, Whats App Time, Whatsapp, Whatsappdark-

నైట్‌ మోడ్‌ ఆప్షన్‌ ప్రస్తుతం చాలా యాప్స్‌ను ఉపయోగిస్తున్నాయి.కాని ప్రముఖమైన వాట్సప్‌ మరియు పేస్‌బుక్‌లో నైట్‌ మోడ్‌ను తీసుకు రాలేదు.ఇప్పుడు వినియోగదారుల ఇబ్బందిని గుర్తించిన వారు నైట్‌ మోడ్‌ను తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు.

దీంతో లవర్స్‌ గంటలు గంటలు చాటింగ్‌ చేసుకున్న ఇబ్బంది ఉండదు.ఇది నిజంగా లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌ అని చెప్పాలి.

ఎన్నో ఫీచర్స్‌ను తీసుకు వచ్చిన వాట్సప్‌ ఈ ఫీచర్‌ను ఇప్పటికే బీటా వర్షన్‌లో తీసుకు వచ్చింది.త్వరలోనే రెగ్యులర్‌ వారికి కూడా ఇవ్వబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube