ఢిల్లీ ఎన్నికలలో దిశ చట్టం ఎఫ్ఫెక్ట్...

హైదరాబాద్ లో దిశ అత్యాచారం, హత్య తరువాత నిందితుల ఎన్ కౌంటర్ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.ఇక ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి 21 రోజుల్లో అత్యాచారం ఘటనలలో తీర్పు వెల్లడించే విధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిశ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు.

 Aravind Kejriwal Aamaadmi Delhi Elections-TeluguStop.com

ప్రస్తుతంలో ఏపీలో అత్యాచారానికి సంబందించిన కేసులన్నీ చాలా వరకు దిశ చట్టం ద్వారానే కేసులు బుక్ అవుతున్నాయి.ఇక దిశ చట్టం ఏపీలో అమలు చేసిన తర్వాత నేషనల్ మీడియా సైతం దీనిని కొనియాడింది.

ఇక ఇతర రాష్ట్రాలలో కూడా దిశ చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే త్వరలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికలలో ఎలా అయిన అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీ చూస్తుంది.అయితే మరోసారి గెలిచి రెండో సారి పీఠాన్ని దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచనలో ఉంది.

ఈ నేపధ్యంలో ఇప్పుడు ఆప్ పార్టీ దిశ చట్టాన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.దేశ రాజధానిలో ఎక్కువగా జరుగుతున్న మహిళలపై దాడులని నియంత్రించడానికి దిశ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం ద్వారా ప్రజలని ఆకట్టుకోవాలని అనుకుంటున్నారు.

ఇప్పటికే పరిపాలనలో ప్రజా మన్ననలు పొందుతున్న దీనిని కూడా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీనిని పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube