మేము అమిత్ షా ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నాం మూడు కోట్లు ఇవ్వండి అంటూ

మేము కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నాము.సార్ మిమ్మల్ని మూడు కోట్ల రూపాయలు పంపించామన్నారు అంటూ హర్యానా విద్యుత్ శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా కు ఫోన్ కాల్ వెళ్లినట్టుగా వార్త బయటకు రాగానే తీవ్ర సంచలనం సృష్టించింది.

 Fake Call Unkwon Persons To Haryana Minister-TeluguStop.com

ఓ ఇద్దరు దుండగులు ఓ టీవీ సీరియల్ లో చూపించిన సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఫేక్ ఫోన్ కాల్ డ్రామాకు వ్యూహరచన చేశారు.వీరిద్దరు భారత్ లో నిషేధానికి గురైన ఒపేరా బ్రౌజర్ యాప్ ద్వారా హర్యానా విద్యుత్ శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా కు ఫోన్ చేసి పార్టీ విరాళం కింద మూడు కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

అయితే ఈ ఫోన్ కాల్ పై అనుమానం వచ్చిన రంజిత్ సింగ్ చౌతాలా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఢిల్లీ పోలీసులు నిందితులను హర్యానా భవన్ లో అరెస్టు చేశారు.ఆ తర్వాత పూర్తిస్థాయిలో విచారణ చేయగా నిందితులు ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించారు.

వీరిద్దరిలో ఒకరు సిర్సాలో లెదర్ షాప్ నిర్వహిస్తుండగా మరొకరు చండీగఢ్ లో టాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో రాజకీయంగా కలకలం రేగింది.

అయితే ఆ తరువాత మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా స్పందిస్తూ తనను డబ్బులు ఇవ్వాలంటూ ఎవరూ డిమాండ్ చేయలేదని, తనకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు అంటూ వివరణ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube