ఏటీఎం లో డబ్బులు తీస్తున్నారా ? అయితే ఇది తప్పనిసరి

ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా బ్యాంకుల దగ్గర, ఏటీఎం మోసాలు చేయడంలోనూ నేరగాళ్లు ఏదో ఒక రూపంలో సవాల్ విసురుతూనే ఉన్నారు.ముఖ్యంగా నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగే ఏటీఎం ల దగ్గర మోసాలు ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి.

 Sbi Introduce Otp Based Atm Cash Withdrawals-TeluguStop.com

అయితే ఏటీఎంల దగ్గర మోసాలు జరగకుండా ఆయా బ్యాంకులు ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి.దానిలో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త తరహాలో వినియోగదారులు డబ్బులు తీసుకునే పద్ధతికి శ్రీకారం చుట్టింది.

ఇకపై ఎస్బీఐ ఎటిఎం నుంచి ఎవరు డబ్బులు విత్ డ్రా చేయాలన్నా ముందుగా ఆ రిజిస్టర్ మొబైల్ కి వన్ టైం పాస్ వర్డ్ వచ్చేలా రూపకల్పన చేశారు.

Telugu Otp, Sbi Atm, Sbiotp, Bankindia-

ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే డబ్బులు బయటికి వస్తాయి.ఈ కొత్త విధానాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.దేశవ్యాప్తంగా ఎస్బిఐ ఏటీఎం లు అన్నిటికీ ఈ విధానం వర్తించబడుతుంది.

కానీ పదివేల కంటే ఎక్కువగా విత్ డ్రా చేసే కస్టమర్ మొబైల్ కు మాత్రమే ఓటిపి వచ్చే విధంగా రూపకల్పన చేశారు.దీనివల్ల ఖాతాదారుల డబ్బులకు సెక్యూరిటీ ఉంటుందని ఎస్బీఐ భావిస్తోంది.

ఒక ఓటీపీ ద్వారా రోజుకు ఒక లావాదేవీ మాత్రమే చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube