రాజకీయ దుమారం రేపిన ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు...

దేశంలో పౌరసత్వ సవరణ బిల్లుపై బీజేపీ తీసుకున్న నిర్ణయానికి దేశ వ్యాప్తంగా విపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ బిల్లు మైనారిటీ హక్కులని హరించే విధంగా ఉందని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.

 Army Chief Bipin Rawat Faces Flak From Political Leaders-TeluguStop.com

మరో వైపు ఈ బిల్లుకి మద్దతుగా కూడా ఆందోళన చేస్తున్నారు.ముఖ్యంగా ముస్లిం, మైనార్టీ ఓటు బ్యాంకుతో పని చేస్తున్న పార్టీలన్నీ కూడా ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో ఆ పార్టీలే వెనకుండి ఆందోళన కారులని రెచ్చగొడుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ నిరసనలని ఇండియన్ ఆర్మీ నియంత్రించడానికి ప్రయత్నం చేస్తుంది.తాజాగా ఈ ఆందోళనని ఉద్దేశిస్తూ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావన్ రాజకీయ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రజలనుసరైన మార్గంలో నడిపించలేని వాళ్లు నాయకులు కాదు అంటూ కామెంట్స్ చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలు పౌరసత్వ ఆందోళన చేస్తున్న వారిని రెచ్చగొడుతున్న రాజకీయ పార్టీల నేతలకి సూటిగా తగిలాయి.

దీంతో ఈ వాఖ్యాలని వారు కాస్తా సీరియస్ గా తీసుకొని స్పందించారు.ఏంఐఏం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎవరి పరిమితులు ఎంత వరకో కూడా నాయకత్వానికి తెలుసు.

పౌర అధికార భావనను అర్థం చేసుకోవడానికి, మీరు నడిపిస్తున్న సంస్థ సమగ్రతను కాపాడేందుకు ఇది చాలా అవసరం అని వాఖ్యలు చేశారు.కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం స్పందించి జనరల్ సాహెబ్‌తో నేను ఏకీభవిస్తున్నాను.

అయితే మత కల్లోలాలు, మారణహోమాలకు తమ అనుచరులను రెచ్చగొట్టే వాళ్లు కూడా నాయకులు కాదు.నా వ్యాఖ్యలని మీరు ఏకీభవిస్తారా అని ప్రశించారు.మరి బిపిన్ వాఖ్యాల మరింత మందికి కోపాన్ని తెప్పిస్తాయనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube