సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ లో తొక్కిసలాట

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అతని షూటింగ్ జరుగుతూ ఉంది అంటే అభిమానులు, సాధారణ ప్రేక్షకులు వచ్చి మీద పడిపోతారు.

 Rasmika Mandanna Mahesh Babu Sarileru Neekevvaru-TeluguStop.com

ఇక ఇలాంటి ఫాన్స్ ని కంట్రోల్ చేయడానికి కొన్ని సందర్భాలలో పోలీసులు ఉంటారు.కొన్ని సందర్భాలలో బౌన్సర్స్ ఉంటారు.

అయితే ఇలాంటి చోట్ల సెక్యూరిటీ ఏ మాత్రం తగ్గిన ఫాన్స్ ని ఆపడం ఎవరి వాళ్ళ కాదు.ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా షూటింగ్ లో అదే పరిస్థితి ఎదురైంది.

తొక్కిసలాట జరగడంతో పలువురుకి గాయాలు అయ్యాయి.

హైదరాబాద్ లోని గబ్చిబౌలిలో మహేష్ బాబు సరిలేరు సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఇందులో భాగంగా మహేష్ బాబుతో ఫ్యాన్స్ కోసం ఫొటో షూట్ ను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఏర్పాటు చేసింది.విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు.

సూపర్ స్టార్ తో ఫొటోలు దిగేందుకు ఎగబడటంతో షూట్ లో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది.బారికేడ్లు విరిగిపోయాయి.దీంతో పలువురికి గాయపడ్డారు.ఈ విషయమై స్థానిక పోలీసులకు నిర్మాతలు సమాచారం ఇచ్చారు.

గాయపడిన వారిని లింగంపల్లి ఆస్పత్రికి తరలించారు.మరోవైపు మహేశ్ బాబు బౌన్సర్లు తమపై దాడి చేశారంటూ ఫాన్స్ ఆరోపించారు.

అయితే ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube