విశాఖ కేంద్రంగా జగన్ రాజకీయం ?

విపక్షాలను ఇరుకున పెట్టే విధంగా ఎప్పటికప్పుడు జగన్ తన వ్యూహాలను అమలు చేస్తున్నారు.జగన్ తీసుకున్న నిర్ణయాలు విపక్షాలు వ్యతిరేకించడం, ధర్నాలు, ఆందోళనలు చేయడం చేస్తున్నాయి.

 Jagan Desistion Ap Cabinet Meet At Visakapatnam-TeluguStop.com

అయితే అంతిమంగా తన నిర్ణయాలు ప్రజల నుంచి హర్షం వ్యక్తం అయ్యేలా చేసుకుంటూ, తనపై విమర్శలు చేసిన రాజకీయ ప్రత్యర్ధులు తిరిగి తన నిర్ణయాన్ని సమర్థించే లా జగన్ చేసుకోగలుగుతున్నారు.తాజాగా అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయినట్టుగా కనిపించినా మెల్లిమెల్లిగా ప్రతిపక్షాలు తన దారిలోకి తెచ్చుకుంటున్నారు.

రాజధాని నిర్మాణంపై ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదికను ఇచ్చింది.ఆ నివేదికను ఈ నెల 27వ తేదీన కేబినెట్ తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు మంత్రి బొత్స ప్రకటించారు.

అయితే 27వ తేదీన క్యాబినెట్ మీటింగ్ విశాఖలో నిర్వహించేలా జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.విశాఖలో క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా అటు టీడీపీ కి చెక్ పెట్టడంతో పాటు అమరావతిలో రాజధాని రైతుల నిరసనలు వైసిపి తగలకుండా జగన్ స్కెచ్ వేశారు.

ఉత్తరాంధ్రకు చెందిన తెలుగుదేశం నాయకులు ఇప్పటికే జగన్ నిర్ణయానికి మద్దతు ప్రకటించడంతో ఈ నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందని జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube