వర్మపై ఆది పంచ్‌లు.. నవ్వుకున్న జనసైనికులు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన వివాదమే.ఇటీవల ఈ దర్శకుడు తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఎలాంటి వివాదాన్ని రేకెత్తించిందో అందరికీ తెలిసిందే.

 Hyper Aadi Skit On Ram Gopal Varma-TeluguStop.com

ఈ సినిమా ఏపీ రాజకీయాల ఆధారంగా తెరకెక్కినా వర్మ మాత్రం కేవలం కల్పితమే అంటూ చెప్పుకొచ్చాడు.ఇక సినిమా రిలీజ్ అయ్యి ఫెయిల్యూర్‌గా మిగిలింది.

కాగా ఈ సినిమాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వర్మ తనదైన సెటైర్లు విసురుతూ నవ్వించే ప్రయత్నం చేశాడు.ఇది కాస్త పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది.

దీంతో పవన్ అభిమాని అయిన జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది, రామ్ గోపాల్ వర్మపై ఓ కామెడీ స్పూఫ్ చేశాడు.ఈ స్కిట్‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మలపై హైపర్ ఆది పంచుల బాంబులు వేస్తూ పోయాడు.

రాఘవేంద్ర రావు గురించి చెబుతూ రామారావు దగ్గరనుంచి ఆయన మనవడి వరకు అందరి మనసులు గెలిచాడని, వర్మ గురించి చెబుతూ రామారావు దగ్గరనుంచి ఆయన మనవడి వరకు అందరి మనసులు కెలికాడు అంటూ చెప్పుకొచ్చాడు.ఇలా స్కిట్ మొత్తం వర్మకు యాంటీగా సెటైర్లు విసురుతూ ఆది స్కిట్ సాగింది.

ఈ స్కిట్‌పై పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఆదిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube