మెగా డాటర్‌ మరో ప్రయత్నం, ఈసారి బన్నీ ఛాన్స్‌ ఇచ్చాడు

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక మెగా వారసురాలు నిహారిక ఇలా వచ్చి అలా వెళ్లి పోతుంది.కాని ఇప్పటి వరకు ఈ అమ్మడికి ఒక మంచి స్టార్‌డం అయితే దక్కలేదు.

 Mega Daughter Niharikha Act In Allu Arjun Movie-TeluguStop.com

తెలుగులోనే కాకుండా ఈమె తమిళంలో కూడా సినిమాలు చేస్తుంది.కాని ఈమెకు మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు రావడం లేదు.

హీరోయిన్‌గానే కాకుండా ముఖ్య పాత్రల్లో కూడా ఈమె నటిస్తుంది.కాని ఈమె ఇప్పటి వరకు కమర్షియల్‌ బ్రేక్‌ను దక్కించుకోలేక పోయింది.

Telugu Niharikha, Niharikhaallu, Nagababudaugher, Niharikha Web, Nikharikhasaira

ఇటీవల సైరా చిత్రంలో నటించిన ఈ అమ్మడికి అందులో కూడా కొద్ది పరిమాణంలోనే స్కోప్‌ దక్కింది.దాంతో ఈమెను జనాలు ఎవరు కూడా నోటెడ్‌ చేసుకోలేదు.ఇప్పుడు ఈమె మరో అవకాశంను దక్కించుకుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో ఈమెకు ఒక కీలకమైన పాత్ర దక్కినట్లుగా తెలుస్తోంది.

వీరిద్దరి కాంబో మూవీకి భారీ క్రేజ్‌ ఉంది.అలాంటి మూవీలో కీలక పాత్ర అంటే తప్పకుండా ఈసారి అమ్మడి పంట పండినట్లే అంటూ జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Niharikha, Niharikhaallu, Nagababudaugher, Niharikha Web, Nikharikhasaira

ఒక వైపు హీరోయిన్‌గా మరో వైపు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్న నిహారిక మరో వైపు వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తుంది.తెలుగులో వెబ్‌ సిరీస్‌లకు ఆజ్యం పోసింది ఈమె అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈమె ఆవకాయ్‌ బిర్యానీ అనే వెబ్‌ సిరీస్‌తో మెప్పించింది.ఆ తర్వాత కూడా రెండు మూడు వెబ్‌ సిరీస్‌ల్లో నటించింది.ప్రస్తుతం మరో వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ నిర్మిస్తూ ఉంది.నటిగా నిర్మాతగా బిజీగా ఉన్న నిహారికకు అల్లు అర్జున్‌ సినిమాలో ఛాన్స్‌ రావడం గొప్ప విషయంగా సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube