విడ్డూరం: 50 పైసల బకాయి కోసం కోర్టు నోటీసులు పంపిన బ్యాంకు

దేశంలో బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని పంగనామం పెట్టే బడా వ్యాపారులను ఏమీ చేయలేని బ్యాంకులు ఓ సామాన్యుడి ఇంటికి కోర్టు నోటీసులు అంటించారు.అతడు వెంటనే బకాయిని చెల్లించాలంటూ నోటీసులు పంపించారు.

 Rajasthan Man Gets Court Notice For 50 Paisa Debt 50-TeluguStop.com

ఇంతకీ ఆ సామాన్యుడు ఎంత బకాయి పడ్డాడు అని మీరు అనుకుంటున్నారా?

రాజస్థాన్‌లోని ఝున్‌ఝునులోని ఖేత్రిలో నివసించే జితేంద్ర సింగ్ అనే వ్యక్తి బ్యాంకు నుండి రుణం తీసుకున్నాడు.కాగా బ్యాంకు ఏర్పాటు చేసిన లోక్ అదాలత్‌లో జితేంద్ర సింగ్ డబ్బును చెల్లించాడు.

ఒక 50 పైసలు మాత్రం అతడు చెల్లించలేదు.దీంతో బ్యాంకు సిబ్బంది తమకు 50 పైసల బకాయిని చెల్లించాలంటూ కొన్నిరోజులకు కోర్టు నోటీసులు పంపించారు.

జితేంద్ర సింగ్ అనారోగ్యం పాలుకావడంతో తన తండ్రి వినోద్ సింగ్‌ను డబ్బు కట్టమని బ్యాంకుకు పంపించాడు.

అయితే వారు 50 పైసలు డిపాజిట్ చేసుకోమని బ్యాంకు వారు చెప్పడంతో జితేంద్ర సింగ్ అయోమయంలో పడిపోయాడు.

డబ్బులు తీసుకోని వారు తన ఇంటికి కోర్టు నోటీసులు ఎలా అంటించారంటూ జితేంద్ర సింగ్ వాపోయాడు.కాగా 50 పైసల డిపాజిట్ చేసుకోని బ్యాంకుపై తాను కోర్టుకు వెళతానంటూ జితేంద్ర సింగ్ తెలిపాడు.

ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube