కార్గిల్ యుద్ధంపై మాజీ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం ఇప్పిడికి రెండు దేశాలకి ఒక పీడకల అని చెప్పాలి.1999లో జరిగిన ఈ యుద్ధం సమయానికి భారత్ సైనిక పరంగా అంత శక్తివంతమైన దేశం కాకపోయినా కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేసి విజయం సాధించింది.కాశ్మీర్ ని హస్తగతం చేసుకోవాలని చూసిన పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత్ ఆర్మీ కోలుకోలేది దెబ్బ కొట్టింది.ఇదిలా ఉంటే ఈ కార్గిల్ వార్ లో భారత్ సైనికులు కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

 Army Chief Malik Kargil-TeluguStop.com

దీనికి కారణం విదేశీయులు సరఫరా చేసిన నాసిరకమైన ఆయుధాలే అని ఒకప్పటి ఆర్మీ చీఫ్ వీపీ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కార్గిల్‌ యుద్ధ సమయంలో ఆయుధాలను సమకూర్చే పేరిట విదేశాలు ఇష్టారాజ్యంగా దోచుకున్నాయని వీపీ మాలిక్‌ అన్నారు.

శాటిలైట్‌ చిత్రాలు, ఆయుధాలు, మందుగుండు వంటి వాటి కోసం ఎక్కువ మొత్తం భారత్‌ నుంచి వసూలు చేశాయని పేర్కొన్నారు.ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన రావడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు.

చండీగఢ్‌లో జరుగుతున్న మిలటరీ లిటరేచర్‌ ఫెస్టివల్‌ లో ఈ వ్యాఖ్యలు చేశారు.ఇలా విదేశీయులు సరఫరా చేసిన ఆయుధాలలో కూడా నాణ్యత లేవని అప్పటికి 30 ఏళ్ల క్రితం వాడిన ఆయుధాలు పునరుద్ధరించి మనకి ఇచ్చారని, దానికోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసారని అన్నారు.

మన దగ్గర ఆయుదాలు ఉత్పత్తి సరైన విధంగా లేకపోవడం, ఆయుధాల ఉత్పత్తిలో ప్రభుత్వ రంగ సంస్థలు వైఫల్యం కారణంగా ఇతర దేశాల చేతిలో మనం మోసపోయామని వ్యాఖ్యలు చేసారు.అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అతని రష్యాని ఉద్దేశించి చేసారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కార్గిల్ యుద్ధం సమయంలో ఇండియాకి ఎక్కువగా ఆయుధాలు సమకూర్చింది రష్యా అని చాలా మంది చెబుతున్నారు.దీంతో ఇప్పుడు మాలిక్ వ్యాఖ్యల ఆ దేశాన్ని ఉద్దేశించినవే అని చెప్పుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube