ఫొటోటాక్‌ : మరో లవర్‌తో వచ్చిన రౌడీ

విజయ్‌ దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రంలోని నలుగురు హీరోయిన్స్‌ లుక్స్‌ను రివీల్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు డేట్లు ప్రకటించారు.

 Vijay Devarakonda World Famous-TeluguStop.com

నిన్న ఐశ్వర్య రాజేష్‌ లుక్‌ రివీల్‌ అయ్యింది.ఆ పోస్టర్‌లో కనిపిస్తున్న జంట పేరు శీనయ్య మరియు సువర్ణ.

నేడు మరో జంటను విడుదల చేశారు.

అన్నింట్లో ఉన్నది విజయ్‌ దేవరకొండ అయినా కూడా పేర్లు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి.

చాలా విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ఒక ఇంగ్లీష్‌ హీరోయిన్‌ కూడా ఉందనే విషయం తెల్సిందే.ఆమె లుక్‌నే నేడు విడుదల చేశారు.ఇజా మరియు గౌతమ్‌ లుక్‌ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ పోస్టర్స్‌ను విడుదల చేశారు.నిన్నటి పోస్టర్‌లో మాదిరిగా ఈ పోస్టర్‌లో కూడా విజయ్‌ దేవరకొండ చాలా స్టైల్‌గా కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రెండు పోస్టర్స్‌తో పాటు రేపు, ఎల్లుండి మరో రెండు పోస్టర్లు రాబోతున్నాయి.రేపు క్యాథరిన్‌ తెర్సా లుక్‌ రానుండగా, ఎల్లుండి రాశిఖన్నా లుక్‌ రాబోతుంది.

జనవరి 3న టీజర్‌ను విడుదల చేయబోతున్నారు.

Telugu Lover Poster- .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube