బ్రిటన్ ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయులు: 12 మంది ఘన విజయం

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు.కన్జర్వేటివ్, లేబర్ పార్టీల నుంచి పోటీ చేసిన సుమారు 12 మంది భారతీయులు భారీ మెజారిటీతో విజయం సాధించారు.

 Uk Elections 2019 Tanman Jeeth Singh-TeluguStop.com

గురువారం జరిగిన సాధారణ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఫలితాలు వెలువడ్డాయి.యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం ప్రధాన ఉద్దేశ్యం నేపథ్యంగా కలిగిన ఈ ఎన్నికలను బ్రెగ్జిట్ ఎన్నికలుగా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ మరోసారి అధికారాన్ని అందుకుంది.

ఈ ఎన్నికల్లో గెలిచిన 12 మందిలో గత పార్లమెంట్‌లో సభ్యులుగా ఉన్న భారత సంతతి అభ్యర్థులంతా తమ స్థానాలను తిరిగి నిలబెట్టుకోగా.

కన్జర్వేటివ్ పార్టీకి చెందిన గగన్ మోహింద్రా, క్లైర్ కౌటిన్హో, లేబర్ పార్టీ నుంచి నవేంద్ర మిశ్రా కొత్తగా సభకు ఎన్నికయ్యారు.సర్రే ఈస్ట్‌ నుంచి పోటీ చేసిన కౌటిన్హో 24,040 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా.

మోహింద్రా తన హెర్ట్‌ఫోర్డ్ షైర్ సౌత్ వెస్ట్ నుంచి 14,408 ఓట్ల మెజార్టీతో తిరిగి కైవసం చేసుకున్నాడు.

Telugu Indianorigin, Telugu Nri Ups, Uk-

భారత సంతతి ఎంపీ ప్రీతీ పటేల్‌కు జాన్సన్ కొత్త క్యాబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.ఆమె ఎసెక్స్‌లోని వితం నియోజకవర్గం నుంచి 24,082 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ 27,210 ఓట్ల మెజార్టీతో, బ్రిటన్ మాజీ అంతర్జాతీయ అభివృద్ధి మంత్రి అలోక్ శర్మ 24,393 ఓట్ల మెజారిటీతో రీడింగ్ వెస్ట్ నుంచి గెలుపొందారు.

Telugu Indianorigin, Telugu Nri Ups, Uk-

శైలేష్ వర నార్త్ వెస్ట్ కేంబ్రిడ్జి షైర్ నుంచి 25,983 ఓట్ల మెజారిటీతో, గోవాకు చెందిన సుయెల్లా బ్రావెర్మాన్ 26,086 ఓట్ల మెజార్టీతో ఫరేహామ్‌ నుంచి విజయం సాధించారు.నవేంద్ర మిశ్రా స్టాక్‌ఫోర్డ్ నుంచి 21,695 ఓట్లతో గెలుపొంది తొలిసారి ఎంపీగా సభలో అడుగుపెట్టనున్నారు.మొదటి బ్రిటీష్ సిక్కు మహిళా ఎంపీగా గత ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన ప్రీత్ కౌర్ గిల్ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ నుంచి 21,217 ఓట్లతో మరోసారి సత్తా చాటారు.

ఆగ్నేయ ఇంగ్లాండ్‌‌లోని స్లౌగ్ నుంచి పోటీ చేసిన సిక్కు ఎంపీ తన్మన్ జీత్ సింగ్ 13,640 ఓట్ల తేడాతో ధేసీ మరో భారత సంతతి అభ్యర్ధి కన్వాల్ టూర్ గిల్‌ను ఓడించారు.

వీరేంద్ర శర్మ ఈలింగ్ సౌతాల్‌ నుంచి 25,678 ఓట్ల మెజార్టీతో సులభంగా విజయం సాధించారు.విగాన్ నుంచి 21,042 ఓట్లతో లీసా నందీ.ఫెల్దం, హెస్టన్‌‌ల నుంచి పోటీ చేసిన సీమా మల్హోత్రా 24,876 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ కీత్ వాజ్ సోదరి వాలెరీ వాజ్ వాల్సాల్ సౌత్ నుంచి 20,872 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్ధి గుర్జిత్ బెయిన్స్‌ను ఓడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube