'ఆయనకు ఇంగ్లీష్ పెళ్ళాం కావాలి కానీ ఏపీ పిల్లకు ఇంగ్లీష్ మీడియం మాత్రం వద్దు': వైకాపా ఎమ్మెల్యే

ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలన్న ఆలోచన మంచిదే కానీ ఈ ప్రతి పాదనకు ప్రతి పక్ష, విపక్షాల నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 Biyyapu Madhusudhan Reddy English Medium Education-TeluguStop.com

Telugu Chittoor, English Medium, Janasenapawan, Srikalahsthi, Ysjaganm, Ysrcp-Te

అయితే ఈ క్రమంలో కొందరు నాయకులు అయితే ఏకంగా రాష్ట్రంలో తెలుగు భాషను లేకుండా చేయడానికి వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.మరి కొందరైతే భవిష్యత్ లో పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య చాలా అవసరమని, మొదట ఆంగ్ల మీడియంలో బోధనకు ఇబ్బంది పడినా తర్వాత భవిష్యత్ తరాలు బాగు పడుతాయని, వైకాపా నిర్ణయం సరైందని ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.అయితే తాజాగా ఈ విషయంపై చిత్తూరు జిల్లాకు చెందినటువంటి శ్రీకాళహస్తి శాసన సభ్య ఎమ్మెల్యే బియ్యపు మధు సుధన్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగించారు. 

ఇందులో భాగంగా ప్రస్తుతం పల్లెల్లోని విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివేందుకు దగ్గర్లోని పట్టణ పరిసర ప్రాంతాలకు వెళుతున్నారని, ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారన్నారు.

మరి కొందరైతే ప్రయివేట్ పాఠశాలల్లో చదివే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.అంతేగాక  ఇతర దేశాల్లో ఉద్యోగాలు కావాలన్నా, అక్కడ స్థిర పడాలన్నా ఆంగ్లం చాలా ముఖ్యమని  అన్నారు.

అంతేగాక తాను ఈ మధ్యనే అమెరికాకి వెళ్లానని అక్కడ ఇంగ్లీష్ రాక ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాని తెలిపారు. 

అయితే ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య అనే అంశంపై ఓ ప్రతి పక్ష నేత తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయంపై మధు సుధన్ రెడ్డి స్పందిస్తూ “ఆయనకు ఇంగ్లీష్ పెళ్ళాం కావాలి కానీ ఏపీ పిల్లకు ఇంగ్లీష్ మీడియం వద్దు” అంటూ వ్యంగంగా విమర్శలు చేశారు.ప్రస్తుతం ఇంగ్లీష్ రాక ఎంతో మంది యువత ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతున్నారని అన్నారు.

అందుకే ఎలాగైనా ఈ సమస్యను అధిగమనించాలానే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సభాముఖంగా తెలిపారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube