వావ్‌ : 9 ఏళ్ల వయసులోనే ఈ బుడ్డోడు సాధించింది ఏంటో తెలిస్తే అవాక్కవుతారు

మనం ఇప్పటి వరకు 10 ఏళ్ల పిల్లాడు 10వ తరగతి పరీక్ష రాశాడు, చిన్న వయస్సులోనే ఇంటర్‌ చదివాడు.15 ఏళ్ల వయసులోనే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు అంటూ ఎన్నో వార్తలు చదివాం.కాని మొదటి సారి 10 ఏళ్లు కూడా నిండని కుర్రాడు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడనే వార్త మీడియాలో ప్రముఖంగా వస్తుంది.నెదర్లాండ్స్‌కు చెందిన 9 ఏళ్ల లారెంట్‌ సైమన్స్‌ అనే కుర్రాడు అప్పుడే ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడు అయిన గ్రాడ్యుయేట్‌గా రికార్డు దక్కించుకున్నాడు.

 9 Years Child Genius Gets University Degree In Electrical Engineering-TeluguStop.com

Telugu Child, Childgenius, Nedarland, Telugu General-

అయిదు సంవత్సరాల వయసులోనే ఇతడు అద్బుతమైన పరిజ్ఞానం కలిగిన కుర్రాడు అంటూ అతడి టీచర్లు గుర్తించారు.అతడికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేకుండానే సొంతంగా బుక్స్‌ చదువుకుంటూ ఉన్నత చదువులు చదివాడు.ఎంత కఠినమైన పుస్తకం అయినా ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి చేయడం.దానిలో ఉన్న 99 శాతం పాఠ్యాంశంను గుర్తు పెట్టుకోవడం ఇతడికి ఉన్న సత్తా.కేవలం గుర్తు పెట్టుకోవడం మాత్రమే కాదు ఆ పాఠంను నిజ జీవితంలో అప్లై చేయడం కూడా ఇతనికి వచ్చిన విద్య.

Telugu Child, Childgenius, Nedarland, Telugu General-

నెదర్లాండ్‌లోని ప్రముఖ యూనివర్శిటీ ప్రత్యేంకగా ఇతడితో పరీక్షలు రాయించి గ్రాడ్యుయేషన్‌ పట్టా ఇచ్చింది.సైమన్స్‌ తమ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయడం పట్ల ఆ యూనివర్శిటీ ప్రొఫెసర్స్‌ కూడా చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నారు.పదేళ్లు కూడా లేని ఈ కుర్రాడు సాధించిన ఈ విషయం ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు సాధించలేదని, ఇతడిలా మరెవ్వరు భవిష్యత్తులో కూడా 10 ఏళ్లకే ఇంతగా ప్రతిభ కనబర్చరంటూ ఆ యూనివర్శిటీ వారు అంటున్నారు.

చదువు మాత్రమే కాకుండా ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా ప్రముఖ కంపెనీలో కీలక విభాగాల్లో జాబ్‌ కూడా చేస్తున్నాడు.నెలకు పాతిక వేల డాలర్లను కూడా ఈ కుర్రాడు అప్పుడే సంపాదిస్తున్నాడు.

మాస్టర్స్‌ను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న లారెంట్‌ భవిష్యత్తులో మరో ఐన్‌స్టిన్‌ అవుతాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube