ఎన్‌కౌంటర్‌ చేసిన ఎస్సై, కానిస్టేబుల్స్‌ను విచారించిన ఎన్‌హెచ్చార్సీ

దిషా నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెల్సిందే.ఎన్‌కౌంటర్‌పై పలువురు మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది.

 Nhrc Enquiry-TeluguStop.com

దాంతో జాతీయ మానవ హక్కుల కమీషన్‌ రంగంలోకి దిగింది.దిషా నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన సమయంలో నిందితులు ఎస్సై మరియు కానిస్టేబుల్‌లపై దాడికి దిగారు.

కానిస్టేబుల్‌ మరియు ఎస్సైలు గాయాలతో ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్నారు.వారు మెల్లగా రికవరీ అవుతున్నట్లుగా వైధ్యులు వెళ్లడించారు.

ఎన్‌కౌంటర్‌ సమయంలో డ్యూటీ నిర్వహించిన పోలీసులను జాతీయ మానవ హక్కుల కమీషన్‌ విచారిస్తుంది.ఇప్పటికే ప్రభుత్వంలోని పలువురు పెద్దలను విచారించిన వారు నేడు హాస్పిటల్‌ లో ఉన్న గాయపడ్డ కానిస్టేబుల్‌ మరియు ఎస్సైలను విచారించారు.

ఈ సందర్బంగా పలు ప్రశ్నలను వారు వేసినట్లుగా తెలుస్తోంది.పోలీసులు ఇచ్చిన వాంగ్మూలంను జాతీయ మానల హక్కుల కమీషన్‌ అధికారులు రికార్డ్‌ చేసుకున్నారు.జాతీయ మానవ హక్కుల సంఘం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube