భారతీయుల వలసపై కెనడా నిషేధం ఎత్తివేసి 100 ఏళ్లు: వేడుకకు ఏర్పాట్లు

భారత్ నుంచి కెనడాకి వలస వచ్చిన భారతీయులకు ఆశ్రయం కల్పించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం విక్టోరియాలో వేడుకలు జరగనున్నాయి.సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు జరిగే ఈ కార్యక్రమానికి విక్టోరియా సిటీ హాల్ ఆతిథ్యం ఇవ్వనుంది.పాల్గొనాలని ఆసక్తివున్న ప్రజలు సిటీ హాల్‌కి దగ్గరలో ఉన్న పండోరా వీధిలో ఏర్పాటు చేసిన మెయిన్ ఎంట్రన్స్‌ను ఉపయోగించాలని నిర్వాహకులు తెలిపారు.

 Celebration Of India In Canada-TeluguStop.com

1919కు ముందు నుంచే భారతీయ పురుషులు ఉపాధి కోసం కెనడాలో అడుగుపెట్టారు.అప్పుడు కేవలం మగవారికే అనుమతి ఉండేది, మహిళలు, పిల్లలకు కెనడా ప్రభుత్వం అనుమతించలేదు.అయితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశం నుంచి వచ్చే మహిళలు, పిల్లలపై ఇమ్మిగ్రేషన్ నిషేధాన్ని ఎత్తివేయాలని అప్పటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం.

కెనడాపై ఒత్తిడి తీసుకొచ్చింది.

Telugu Canada, Telugu Nri Ups-

ఈ క్రమంలో డిసెంబర్ 24, 1919న కెనడా ప్రభుత్వం భారతీయ మహిళలు, చిన్నారుల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేసింది.అప్పటి నుంచి అనేక మంది భారతీయులు విద్య, ఉద్యోగ, వ్యాపార, పర్యాటకం కోసం కెనడాకు తరలివస్తున్నారు.అమెరికా, యూకేల తర్వాత భారతీయులు ఎక్కువగా వలస వెళ్లే దేశంగా కెనడా రికార్డుల్లోకి ఎక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube