పవన్ పై మీడియాకు ప్రేమ పెరిగిందా ?

మిగతా రాజకీయ నాయకుల పరిస్థితి వేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు.ఆయన రాజకీయాలకు కొత్తేమీ కాకపోయినా, ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారి.

 Media Support In Pawan Kalyan-TeluguStop.com

అయితే సరైన అవగాహన,ప్రతికూలతలు లేకపోవడంతో పవన్ పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్క సీటుకే ఏపీలో పరిమితం అయిపోయింది.మిగతా రాజకీయ నాయకుల కంటే పవన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.

అయినా దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో పవన్ విఫలం అయ్యారు.అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన పవన్ కు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.

రోజురోజుకు ఆయన హవా పెరుగుతున్నట్టు గానే కనిపిస్తోంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు.ఏపీలో అధికార పార్టీ వైసీపీని ఎదుర్కోవడం లో కూడా పవన్ చాలా ధైర్యంగా, సమర్థవంతంగా అడుగులు వేస్తున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పాత్రను పవన్ పోషిస్తున్నారు.

Telugu Janasenapawan, Pawan Kalyan, Pawankalyan, Tdpchandrababu-

పవన్ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడానికి కారణాలు విశ్లేషిస్తే ఆయనకు మీడియా సపోర్ట్ కూడా పెద్దగా లేకపోవడమే అని అర్థం అవుతోంది.అందుకే ఆయన తన పార్టీ నేతలతో సొంతంగా ఒక టీవీ చానల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.కానీ ప్రస్తుతం పవన్ కు మీడియా సపోర్ట్ బాగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా మీడియా అధినేతలు ఉండడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చే అంశం.పవన్ టిడిపి కి మద్దతు ఇచ్చినతకాలం మీడియా సపోర్ట్ పవన్ కు బాగానే ఉండేది.

కానీ ఆ తర్వాత టీడీపీకి వ్యతిరేకంగా పవన్ మారడంతో ఆయనపై వ్యతిరేక కథనాలు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి.కానీ ప్రస్తుతం పవన్ మీద వ్యతిరేక కథనాలు వండి వార్చిన మీడియా ఛానల్స్ లోనే ఆయనకు ఎక్కడలేని కవరేజ్ ఇస్తున్నాయి.

Telugu Janasenapawan, Pawan Kalyan, Pawankalyan, Tdpchandrababu-

పవన్ ఎంత మారుమూల ప్రదేశానికి వెళ్ళినా ప్రతి నిమిషం అప్డేట్ ఇస్తూ జనాలకు పవన్ దగ్గర చేసే పనిలో పడ్డాయి.వైసీపీ మీద పవన్ చేసిన పోరాటాలు చాలానే ఉన్నాయి.ఇసుక పాలసీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, రైతు సమస్యల మీద పోరాటం, ఇంకా అనేక పోరాటాలను పవన్ ఎంచుకున్నారు.వీటన్నిటికీ మీడియా బాగా కవరేజ్ ఇచ్చింది.

చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన కొత్త లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు కొన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద చిరంజీవి చేసిన వ్యాఖ్యలను హైలెట్ చేసేవి.దీంతో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది అనుకున్న సమయంలో మళ్లీ చిరంజీవి మీద ప్రజారాజ్యం మీద వ్యతిరేక కథనాలు రాయడం ద్వారా టీడీపీకి మేలు జరిగే విధంగా వ్యవహరించాయి.

ప్రస్తుతం టిడిపి బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉండడం జగన్ దూకుడుగా ఉండడం, తదితర కారణాలతో జగన్ కు దీటుగా పవన్ రెడీ చేసేందుకు మీడియా సంస్థలు పోటీ పడుతున్నట్టు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube