వెంకీమామ మరీ ఇంత ఖరీదా? సగమైనా రాబట్టేనా?

ఏ హీరో అయినా ఒక స్థాయి వరకు మార్కెట్‌ను కలిగి ఉంటాడు.ఆ మార్కెట్‌ను మించి బడ్జెట్‌ అయ్యింది అంటే ఖచ్చితంగా అందులో చాలా గొప్ప కంటెంట్‌ ఉండాలి.

 Venkatesh And Nagachaitanya Movie Venky Mamma Latest Update-TeluguStop.com

లేదంటే ప్రముఖ దర్శకుడు అయినా ఆ సినిమాను చేసి ఉండాలి.అలాంటప్పుడే పెట్టిన బడ్జెట్‌ రికవరీ అయ్యేంది.

వెంకీమామ బడ్జెట్‌ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను 40 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించినట్లుగా తెలుస్తోంది.

Telugu Bobby-

వెంకటేష్‌ మరియు నాగచైతన్యలు ఇద్దరు కూడా 20 కోట్ల మార్కెట్‌ లిమిట్‌ ఉన్న వారే.వీరిద్దరి సినిమాలు సక్సెస్‌ అయితేనే 20 కోట్ల వరకు వసూళ్లు అవుతాయి.అదే ఫ్లాప్‌ అయితే అయిదు పది కోట్లు కూడా కష్టమే.అలాంటిది వీరిద్దరు కలిసి నటించిన వెంకీ మామ సినిమాను 40 కోట్లు పెట్టి నిర్మించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

మరీ ఇంత బడ్జెట్‌ ఏంటీ బాసూ అంటూ ప్రశ్నిస్తున్నారు.సురేష్‌బాబు ఈ సినిమాను తన సొంత వారి సినిమా అనుకని అడ్డు అదుపు లేకుండా ఖర్చు పెట్టేశాడు.

‘వెంకీమామ’ సినిమా సూపర్‌ సూపర్‌గా ఉంటే తప్ప 40 కోట్లను రాబట్టడం కష్టం.వచ్చే రెండు వారాల్లో పెద్ద సినిమాలు లేవు కనుక ఈ సినిమాకు కలిసి వస్తుందేమో చూడాలి.

ఇదే సమయంలో వెంకీ మామ ఈ బడ్జెట్‌ను రాబట్టాలంటే అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవాల్సి ఉంటుంది.మరి వెంకీమామ చిత్రం 40 కోట్లు సాధించే స్థాయిలో ఉంటుందా చూడాలి.

ఒక వేళ ఫలితం తారుమారు అయితే సగం అయినా రాబట్టడం సాధ్యమేనా అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube