ఆర్జీవీ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుకి లైన్ క్లియర్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.ఏపీ రాజకీయాలని లక్ష్యంగా చేసుకొని నిజజీవిత పాత్రలని తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా రెండు కులాల మధ్య చిచ్చు పెట్టె విధంగా ఉందని కొందరు హై కోర్టుకి వెళ్లడంతో టైటిల్ ని ఆర్జీవీ మార్చాడు.

 Amma Rajyam Lo Kadapa Biddalu-TeluguStop.com

అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని టైటిల్ మార్చిన కూడా దీనికి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేనందుకు సభ్యులు ముందుకి రాలేదు.వివాదాస్పద అంశాలు ఉన్నాయని సినిమాకి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వలేమని సెన్సార్ సభ్యులు తప్పుకున్నారు.

దీంతో ఆర్జీవీ రివైజింగ్ కమిటీకి వెళ్ళాడు.

ఇదిలా ఉంటె రివైజింగ్ కమిటీ ఇప్పుడు ఈ సినిమాకి లైన్ క్లియర్ చేసింది.

రివైజింగ్ కమిటీ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చి రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే సినిమాలో కొన్ని సన్నివేశాలను కత్తిరిచిన సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ను జారీచేసినట్లు తెలుస్తోంది.సెన్సార్ బోర్డు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల తేదీని ఆర్జీవీ సిద్ధం అయినట్లు తెలుస్తుంది.

మరి టైటిల్ మార్చిన తర్వాత సినిమా రిలీక్ కి ఏపీ ప్రభుత్వం ఎంత వరకు అనుమతి ఇస్తుంది.ఇక ఆడియన్స్ సినిమాని ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube