ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రాలో 132 మందికి కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్ అవకాశం

కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్‌ డిసెంబర్ 5న జరిగిన ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ డ్రాలో 132 ఆహ్వానాలను జారీ చేసింది.కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ (సీఆర్ఎస్)‌లో 400 అంతకంటే ఎక్కువ స్కోర్ చేసిన ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అభ్యర్ధులకు నోటిఫికేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఎన్‌ఓఐ)లు జారీ చేశారు.

 Alberta Invites 132 Express Entry Candidates-TeluguStop.com

అల్బెర్టా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ స్ట్రీమ్ అల్బెర్టా ఇమ్మిగ్రెంట్ నామినీ ప్రోగ్రామ్ (ఏఐఎన్‌పీ)ని ఫెడరల్ ఎక్స్‌‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్‌లో ప్రోఫైల్‌ ఉన్న అభ్యర్ధులను ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తుంది.ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ కెనడాలోని మూడు ప్రధాన ఎకనమిక్ క్లాస్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌ల కోసం అభ్యర్ధులను ఎంపిక చేస్తుంది.

అవి వరుసగా ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ క్లాస్, ఫెడరల్ స్కిల్డ్ ట్రేడ్స్ క్లాస్ మరియు కెనడియన్ ఎక్స్‌పీరియన్స్ క్లాస్.

Telugu Alberta, Albertainvites, Telugu Nri Ups-

అల్బెర్టా నుంచి ప్రావిన్సియల్ నామినేషన్ ఉన్న ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అభ్యర్థులు వారి సీఆర్ఎస్‌ స్కోరుకు అదనంగా 600 పాయింట్లను పొందుతారు.దీనితో పాటు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ తదుపరి డ్రాలో కెనడా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితమైన హామీ లభిస్తుంది.తాజా ఇన్విటేషన్ రౌండ్‌లో కట్ ఆఫ్ స్కోరు 400 కాగా… ఇది గతంలో నిర్వహించిన డ్రాలలో కట్ ఆఫ్ స్కోర్‌ల కంటే చాలా తక్కువ.

అల్బెర్టా ఇమ్మిగ్రెంట్ నామినీ ప్రోగ్రామ్ (ఏఐఎన్‌పీ) ప్రాధాన్యత ఇచ్చే అంశాలు

* అల్బెర్టాలో జాబ్ ఆఫర్ లేదా వృత్తి అనుభవం
* కెనడియన్ పోస్ట్ సెకండరీ సంస్థ నుంచి డిగ్రీ లేదా చెల్లుబాటయ్యే జాబ్ ఆఫర్
* ఇప్పటికే అల్బెర్టాలో నివసిస్తున్న తల్లిదండ్రులు, పిల్లలు లేదా వారి సోదరి/సోదరులు

కాగా అల్బెర్టా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ స్ట్రీమ్ ద్వారా కెనడియన్ శాశ్వత నివాసం కోసం, ప్రాంతీయ నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానించబడిన మొత్తం ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అభ్యర్థుల సంఖ్య 6,752కి చేరుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube