బాలయ్య 106లో 'దిషా' సీన్స్‌

నందమూరి బాలకృష్ణ ‘రూలర్‌’ చిత్రంను మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన రూలర్‌ చిత్రంపై నందమూరి అభిమానులు పెద్దగా ఆసక్తి లేరు.

 Latest Update Of Balakrishna 106 Movie-TeluguStop.com

ఎందుకంటే వీరిద్దరి కాంబోలో వచ్చిన గత చిత్రం జైసింహా ఆకట్టుకోలేదు.ఇప్పుడు బాలయ్య చేయబోతున్న 106వ చిత్రం కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, రూలర్‌ పై నమ్మకం లేని ఫ్యాన్స్‌కు బాలయ్య తదుపరి చిత్రం బోయపాటి దర్శకత్వంలో చేయబోతున్న కారణంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

Telugu Balakrishna, Balakrishnaks-

బాలకృష్ణ, బోయపాటిల కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’ మరియు ‘లెజెండ్‌’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.వీరిద్దరు నిన్న తమ హ్యాట్రిక్‌ మూవీని చేశాడు.ప్రస్తుతం సినిమాపై అంచనాలు పెరిగాయి.గత వారం రోజులుగా దిషా సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విషయం తెల్సిందే.ఆ సంఘటనను బోయపాటి ఈ సినిమాలో పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.నిన్న దిషా నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగింది.

Telugu Balakrishna, Balakrishnaks-

దిషా నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజే బాలయ్య, బోయపాటి సినిమా ప్రారంభం అయ్యింది.భారీ ఎత్తున కార్యక్రమం జరిగింది.దాంతో దిషా నిందితుల ఎన్‌కౌంటర్‌ సీన్స్‌ తమ సినిమాలో ఉండేలా బోయపాటి నిర్ణయం తీసుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది.

వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా పట్టాలెక్కబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube