ఆహా అది నిజమేనా ? ఆ ఇద్దరి ఆశలు ఆవిరేనా ?

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే ఆ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ రాజకీయంగా ఆ పార్టీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ఏపీ ప్రతిపక్ష పార్టీ టిడిపి జనసేన పార్టీ లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించాయి.అందుకే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయంలో ఏ చిన్న సందర్భం దొరికినా తమకు అనుకూలంగా మార్చుకోగలిగాయి.

 Bjp And Tdp Movie In Jamili Elections In Ap-TeluguStop.com

ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల్లో చిన్నచిన్న తప్పులను సైతం వెతికి పట్టుకుని పెద్ద సమస్య లాగా వాటిని చిత్రీకరిస్తూ ప్రజల్లో జగన్ ప్రభుత్వానికి ఆదరణ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు కూడా ఈమధ్య ఎక్కువ అయ్యాయి.అయితే మొదటి ఆరు నెలలు ప్రభుత్వం విమర్శించమని ప్రభుత్వం గాడిలో పడేందుకు ఆరునెలల కాలాన్ని ఇస్తామని ముందుగా ప్రకటించిన టిడిపి అధినేత, ఆ తరువాత మనసు మార్చుకుని విమర్శల బాణాలు వదులుతూనే ఉన్నారు.

Telugu Apcm, Bjp Jamili, Pawankalyan, Tdp Chandrababu-

ఏపీలో కేవలం ఒకే ఒక్క సీటు దక్కించుకున్న జనసేన కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ వస్తోంది.జగన్ కులం, మతం మీద విమర్శలు చేస్తూ పవన్ ప్రస్తుతం వైసీపీ కంచుకోట రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తూ జగన్ హవాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు.అయితే టిడిపి, జనసేన ఈ విధంగా ముందుకు వెళ్లడానికి కారణం ఉంది.మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికలు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని, త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని, అప్పటిలోగా జగన్ హవాను తగ్గించి తాము బలపడాలని టిడిపి, జనసేన అది నాయకులు భావిస్తున్నారు.

అదీ కాకుండా ఇప్పటి నుంచే మోదీతో, బీజేపీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం ద్వారా, రాబోయే ఎన్నికల్లో తాము సునాయాసంగా గట్టెక్కాలని బీజేపీ భవిస్తూ వస్తోంది.వాస్తవానికి ఏపీలో మళ్ళీ ఎన్నికలు 2024లో జరగాల్సి ఉంది.

అయితే కేంద్రం జెమిని ఎన్నికలకు వెళితే 2022 లో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వస్తాయని అందరూ భావిస్తున్నారు.

Telugu Apcm, Bjp Jamili, Pawankalyan, Tdp Chandrababu-

జగన్ చంద్రబాబు కూడా గతంలో అనేకసార్లు జెమిని ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారు.ప్రస్తుతం జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు కేంద్రం వెనకడుగు వేస్తున్నట్టు గా తెలుస్తోంది.ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బిజెపి బాగా దెబ్బతింది.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా లోక్ సభ ఎన్నికల్లో వెనుకబడిన నేపథ్యంలో జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు కేంద్రం వెనకడుగు వేసినట్లు అర్థం అవుతోంది.అదే కాకుండా జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఆయా రాష్ట్రాల అనుమతి కూడా తప్పనిసరి.

కానీ జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు అన్ని రాష్ట్రాలు అంగీకారం తెలిపే పరిస్థితి లేదు.దీంతో ఇక జమిలి ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు అన్నట్టుగా బీజేపీ డిసైడ్ అయిపోయింది.

కానీ కేవలం ఆ ఎన్నికల మీద ఆశలు పెట్టుకున్న జనసేన టిడిపి లు ఇప్పుడు ఉసూరుమంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube