ఐసీయూలో పెళ్లి చేసిన పోలీసులు... పారిపోయిన ప్రియుడు

ప్రేమ పేరుతో నమ్మించి అవసరాలు తీర్చుకొని తరువాత మొహం చాటేయడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ జరుగుతున్న ప్రేమలో మోసపోతున్న యువతులు అయితే తెగించి న్యాయపోరాటం చేస్తున్నారు.లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

 Marry Girlfriend In Icu-TeluguStop.com

ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో తరుచుగా జరుగుతున్నాయి.తాజాగా అలాంటి ఘటన మహారాష్ట్ర పూణేలో చోటు చేసుకుంది.

సూరజ్‌ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు.అయితే అవసరం తీరాక వాడు మొహం చాటేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యయత్నం చేసింది.

ఆమెని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.తనది తక్కువ కులం అనే సాకు చూపించి పెళ్ళి చేసుకోకుండా తప్పించుకున్నాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి మోసం చేసిన ప్రేమికుడుని అదుపులోకి తీసుకున్నారు.యువతి చికిత్స తీసుకుంటున్న హాస్పిటల్ కి అతన్ని తీసుకొచ్చి ఐసీయూలో ఉన్న యువతితో బలవంతంగా వాడితో పెళ్లి జరిపించారు.

పోలీసుల సమక్షంలోనే ప్రేమికులు దండలు మార్చుకున్నారు.అయితే పెళ్లి అయిన కొద్దిసేపటికే యువకుడు ఆస్పత్రి నుంచి జారుకొని పారిపోయాడు.

ఇప్పుడు మళ్ళీ అతన్ని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube