ఎన్కౌంటర్ పై హర్షం వ్యక్తం చేస్తున్న స్టార్ యాంకర్

ఇటీవల హైదరాబాద్ లోని షాద్ నగర్ లో చోటుచేసుకున్న దిశ అత్యాచారం,హత్య ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఒకప్పుడు దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన నిర్భయ ఘటన తరువాత అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకతలు వ్యక్తం అయిన ఘటన ఈ దిశ అత్యాచార ఘటన.

 Anasuya Responded About Disha Case Encounter-TeluguStop.com

ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘటన పై తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.సెలబ్రిటీ లు సైతం ఈ సంఘటన పై తమదైన శైలి స్పందింస్తూ వచ్చారు.అయితే తాజాగా ఈ దిశ అత్యాచార కేసులో నిందితులు అయిన ఆ నలుగురు ఈ రోజు తెల్లవారు ఝామున గం.3:30 నిమిషాలకు ఎంకౌంటర్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ఘటన పై స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి దిశ ను హత్య చేసిన ఆ నిందితులను పోలీసులు ఎంకౌంటర్ చేయడం చాలా హ్యాపీ గా ఉందంటూ ట్వీట్ చేసింది.

అంతేకాకుండా తెలంగాణా పోలీసులకు తన హాట్సాప్ అని కూడా ట్వీట్ చేసింది.

ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం అని నిందితులను ఘటనా స్థలం వద్దకు తీసుకువెళ్లగా వారు పోలీసుల ఆయుధాలను లాక్కొని పారిపోవాలని ప్రయత్నించడం తో విధి లేని పరిస్థితుల్లో ఎంకౌంటర్ చేశామని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో నిందితులు అయిన ఆరిఫ్,జొల్లు శివ,జొల్లు నవీన్,చెన్నకేశవులు అందరూ ఎంకౌంటర్ లో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.నిందితులు ఎంకౌంటర్ లో మృతి చెందడం పలువురు సినీ రాజకీయ ప్రముఖుల తో పాటు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణా పోలీసులకు జిందాబాద్ అని అంటూ చాలామంది నినాదాలు కూడా చేసినట్లు తెలుస్తుంది.

షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద దిశను అతిక్రూరంగా మాటువేసి,నమ్మించి అత్యంత పాశవికంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆమె ప్రాణాలను కూడా తీసి, చివరికి పెట్రోల్ పోసి తగలెట్టేశారు.

రాత్రి సమయంలో సాయం కోసం అర్ధించిన ఆ అభాగ్యురాలిపై కనీసం కనికరం కూడా చూపకుండా మద్యం తాగించి మరి ఆమె పై ఈ ఘోరానికి పాల్పడ్డారు.అలాంటి వారిని ఏమాత్రం క్షమించకూడదు అని, వారికి నడిరోడ్డు పై ఉరి శిక్ష విధించాలి అంటూ పలువురు డిమాండ్ చేస్తున్న ఈ సమయంలో పోలీసులు ఎంకౌంటర్ చేయడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube