పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్‌ ప్రోగ్రామ్‌తో సత్ఫలితాలు: కెనడా వైపు విద్యార్ధుల చూపు

పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ కింద కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఇటీవలి కాలంలో దూసుకెళ్తోంది.ఇది 2005లో 5,400 ఉండగా… గతేడాది 1,43,000కు పెరిగింది.

 Post Graduation Permit Canada-TeluguStop.com

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (పీజీడబ్ల్యూపీపీ) కింద కెనడాలోని పోస్ట్ సెకండరీ విద్యాసంస్థల్లో విదేశీ గ్రాడ్యుయేట్లు వారి చదువుకు పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్ల వరకు కెనడాలో ఉండి ఉద్యోగం చేసుకునేందుకు అనుమతిస్తుంది.ఈ పర్మిట్ వారి అకడమిక్ ప్రోగ్రామ్ కాలవ్యవధిని బట్టి మారుతూ ఉంటుంది.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్… ఓపెన్ వర్క్ పర్మిట్ మాదిరిగా అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు కెనడాలో ఎప్పుడైనా ఏదైనా వృత్తిలో పనిచేయడానికి, కంపెనీలను మారడానికి అనుమతిస్తుంది.ఇందుకు అర్హత పొందాలంటే అభ్యర్ధి కనీసం ఎనిమిది నెలల నిడివి గల అకడమిక్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి ఉండటంతో పాటు ప్రభుత్వం పేర్కొన్న ఇతర ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

పోస్ట్‌ 2000 ప్రారంభంలో గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కెనడాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

Telugu Canada, Permit, Telugu Nri Ups-

గత దశాబ్ధంలో మూడు రెట్లు పెరిగి… 2018 నాటికి 5,72,000కు చేరుకుంది.2005లో 7,400 మందికి పర్మిట్లు జారీ చేయగా… అది 2016 నాటికి 1,17,700కు చేరింది.అంటే 15 రెట్లు పెరుగుదల.ఆ వృద్ధి అలాగే కొనసాగుతూ.2018లో 1,43,000కు చేరుకుంది.దరఖాస్తుదారులు తమ చదువుకు సంబంధించిన రంగంలో యజమాని/ కంపెనీతో ఉద్యోగం చేస్తూ ఉండాలనే నిబంధనను 2008లో తొలగించడం ఈ పర్మిట్‌కు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది.అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత కెనడాలో ఉండటానికి ముందుగా ఒక సంవత్సరం మాత్రమే అనుమతి ఉండేది.

అయితే దీనిని గరిష్టంగా మూడేళ్లకు పెంచడం, తద్వారా వారు శాశ్వతంగా కెనడాలో ఉండటానికి వీలు కల్పించడం కూడా మంచి ఫలితాలను ఇస్తోంది.

దీనికి అదనంగా ఫెడరల్ ప్రభుత్వం, ప్రావిన్సులు అట్లాంటిక్ ఇమ్మిగ్రేషన్ పైలట్ ప్రోగ్రాంతో పాటు అనేక ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ స్ట్రీమ్స్ ద్వారా అంతర్జాతీయ విద్యార్ధులు శాశ్వత నివాసాన్ని పొందేందుకు అదనపు మార్గాలను సృష్టించాయి.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ ద్వారా కెనడాకు అదనపు ప్రయోజనాలు కలిగాయి.అంతర్జాతీయ విద్యార్ధులు ఆ దేశంలో విద్యను అభ్యసించడం, వీసా తదితర వ్యయాల కింద ఏడాదికి 22 బిలియన్ డాలర్లను కెనడా ఖజానాకు అందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube