అజ్ఞాతంలోకి మెగా హీరో.. జాడ చెప్పనంటున్న మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో చాలా మంది తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.వీరిలో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారు ఇప్పటికే తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నారు.

 Allu Arjun To Go Underground For His Next Movie-TeluguStop.com

కాగా స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ తన నటనతో పాటు డ్యాన్స్‌తో ఎనలేని ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.

అయితే బన్నీ ప్రస్తుతం అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేశారు.

అయితే ఈ సినిమాలో పాత్ర కోసం బన్నీ ఏకంగా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో బన్నీ ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడట.

దాని కసం బన్నీ తన గడ్డం పెంచుకోనున్నాడు.

అందుకోసమే బన్నీ ఒక నెలరోజుల పాటు ఎవరికీ కనిపించడని తెలుస్తోంది.

మరి నెలరోజుల పాటు బన్నీ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లి ఎలాంటి లుక్‌తో బయటకు వస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్నారు.అటు అల వైకుంఠపురములో చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించనున్నాడు స్టైలిష్ స్టార్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube