జిన్‌జియాంగ్‌లో జోక్యం: అమెరికాకు షాకిచ్చేందుకు చైనా రెడీ

అమెరికాకు చైనా షాకిచ్చింది.చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోకి అమెరికాకు చెందిన దౌత్యవేత్తలు ప్రవేశించకుండా వారి పాస్‌పోర్టులను నిషేధించే అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.

 Xinjiang China Usdiplomatic-TeluguStop.com

యూఎస్ కాంగ్రెస్ తయారుచేస్తోన్న చట్టాన్ని ప్రతీకారంగా.జిన్జియాంగ్ సమస్యపై యూఎస్ అధికారులు, చట్టసభ సభ్యులు అభ్యంతరకర రీతిలో ప్రవర్తిస్తున్నారని చైనా భావిస్తోంది.

దీనిలో భాగంగానే వీసా ఆంక్షలపై ఆ దేశం కసరత్తు చేస్తోందని గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు జిజిన్ అభిప్రాయపడ్డారు.చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో ఉయిగర్ ముస్లింలతో పాటు మరికొంతమంది మైనారిటీలు కలిపి కనీసం 1 మిలియన్ మందిని అదుపులోకి తీసుకుని శిబిరాల్లో నిర్బంధించారని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మైక్ పాంపియోతో పాటు పలువురు ఉన్నతాధికారులు బహిరంగంగానే విమర్శలు చేశారు.

Telugu China, Telugu Nri Ups, Xinjiang-

అయితే ఈ వ్యాఖ్యలను చైనా ఖండించింది.మతతత్వ తీవ్రవాదాన్ని నిర్మూలించడంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు కొత్త నైపుణ్యాలను నేర్పించడానికి శిక్షణ ఇప్పిస్తున్నామని బీజింగ్ అధినాయకత్వం తెలిపింది.జిన్జియాంగ్‌తో పాటు తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.కాగా స్వయం ప్రతిపత్తి కలిగిన జిన్‌జియాంగ్‌లో ఉయిఘర్ ముస్లిముల పట్ల చైనా అణచివేతకు మద్ధతుగా నిలిచిన 28 కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో మైనారిటీలపై దురాగతాలపై అమెరికాకు చెందిన సాంకేతికతను వినియోగించడం ఏ మాత్రం సహించబోమని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్ ఈ ఏడాది అక్టోబర్‌లో తేల్చి చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube