ఏపీలో దున్నపోతు పాలన కొనసాగుతోంది  

Chandrababu Comments On Jagan Governament-

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో అరాచకపు పాలన కొనసాగుతుందని, అంతా కూడా విద్వంసాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు అక్కడ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.

Chandrababu Comments On Jagan Governament-

గతంలో తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కర్నూలుకు చెందిన ప్రాజెక్ట్‌లు అన్ని కూడా పూర్తి చేశామని ఆయన అన్నాడు.

ఏపీలో జరుగుతున్న పరిపాలన చూస్తుంటే దున్నపోతు పరిపాలన తరహాలో ఉంది అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

సాగునీటి నుండి అన్ని అవసరాలకు కూడా ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.ప్రజా ప్రయోజనాలను కాపాడాలనే కనీస జ్ఞానం కూడా ప్రస్తుత ప్రభుత్వంకు కనిపించడం లేదు అంటూ బాబు విమర్శించాడు.

మాపై కేసులు పెట్టడంపై ఉన్నంత శ్రద్ద ప్రభుత్వంకు పరిపాలనపై ఉండి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తాజా వార్తలు